బెల్ట్‌షాపులపై పోలీసుల రైడింగ్! ఈ మాట వినగానే తప్పు చేసిన షాపు నిర్వాహకులు తప్పించుకుని పారిపోదామని చూస్తారు. కానీ గుజరాత్‌లోని ఓ బెల్ట్‌షాపు యజమాని మాత్రం పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అహ్మదాబాద్ పోలీసులు ఎప్పటిలానే సాధారణంగా అక్రమ బెల్ట్‌షాపులపై దాడులు చేసి వాటి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కానీ ఓ షాపు యజమాని భారీకాయం వల్ల ఎటూ కదలలేక పోలీసులకు చిక్కాడు. పోలీసు స్టేషన్‌కు రానని భీష్మించుకుని కూర్చోవడం వల్ల చేసేది లేక అతనిని మంచంపై ఉంచి మోసుకొనిపోయారు పోలీసులు. ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.