ETV Bharat / bharat

రైతు కష్టనష్టాలకు ఎరువు.. వ్యవస్థలు లోపభూయిష్ఠం..!

రసాయన ఎరువుల రాయితీ పంపిణీ విధానాల్లో లోపాల వల్ల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. రైతుల నుంచి వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఓట్ల రాజకీయం కోసం యూరియాపై అధికంగా రాయితీని భరిస్తున్న కేంద్రం మిగతా ఎరువులపై నియంత్రణను కంపెనీలకు వదిలేసింది.

ఎరువుల సరఫరా-పంపీణీ వ్యవస్థలు లోపభూయిష్ఠం
author img

By

Published : Oct 30, 2019, 8:30 AM IST

సూక్ష్మపోషక ఆధారిత రాయితీ (ఎన్‌బీఎస్‌) విధానం అమలులోకి వచ్చి ఎనిమిదేళ్లయినా డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఏమాత్రం తగ్గలేదు. యూరియాపై మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంది.

ఈ విధానం ప్రకారం యూరియా గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)ను మాత్రమే కేంద్రం నిర్ణయించి, మిగతా ఎరువులను కంపెనీలకు వదిలేస్తున్నాయి. దీనివల్ల ఎరువుల విక్రయాల్లో మోసాలు, అక్రమాలు సాధారణమయ్యాయి. దీనికితోడు గత పుష్కరకాలంలో అనేక ప్రయోగాలతో పరీక్షించి అమలులోకి తెచ్చిన సమగ్ర ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌) కూడా ఎరువుల కొరత, అక్రమ అమ్మకాలకు ఊతమిస్తోంది. ఎరువులపై ఇస్తున్న వేల కోట్ల రూపాయల రాయితీ నిధుల్లో కొంతైనా మిగుల్చుకోవాలనే తపనతో కేంద్రం ఎన్‌బీఎస్‌, ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌లు ప్రవేశపెట్టినా రైతులకు కష్టాలు తప్పడం లేదు. కేంద్రానికి రాయితీ నిధులూ మిగలడం లేదు. అటు ప్రభుత్వ విధానాలు, ఇటు వ్యాపారుల మోసాలు రైతుల జేబుకు చిల్లుపెడుతున్నాయి.

ఇదేం విధానం..?

రైతులు భరించగలిగే స్థాయి ధరలకు ఎరువులు లభించేలా చూడాలన్నది ప్రభుత్వ విధానమని కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో ఏ గ్రామంలోని దుకాణానికి వెళ్లినా బస్తాలపై ముద్రించిన ధరకు ఎక్కువ శాతం అమ్మడం లేదు. గట్టిగా అడిగితే ఎరువుల కొరత అని చెబుతున్నారు. మరోవైపు ఎరువులకు కొరతే లేదని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ పార్లమెంటుకు తెలిపారు. ఎరువులను నల్లబజారుకు తరలించి, ధరలు పెంచి రైతులను వ్యాపారులు దోచుకోవడం దశాబ్దాలుగా సాగుతోంది. దీన్ని అరికట్టి రాయితీ పంపిణీ, అమ్మకాల్లో పారదర్శకత తేవాలని 2007 మే నెలలో ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఎఫ్‌ఎమ్‌ఎస్‌)ను కేంద్రం ప్రారంభించింది.

కంపెనీలో తయారైనప్పటి నుంచి జిల్లా కేంద్రంలోని గోదాములకు చేరేవరకూ ఎరువు ఎటు నుంచి ఎటువెళ్తుందో పసిగట్టాలనేది ఈ ఏర్పాటు లక్ష్యం. తరవాత ‘మొబైల్‌ ఎఫ్‌ఎమ్‌ఎస్‌’ విధానాన్ని 2012లో ప్రవేశపెట్టారు. తయారీనుంచి రైతుకు అమ్మేవరకు ఎరువు ప్రతీ కదలికను ఆన్‌లైన్‌లో వ్యాపారులు, కంపెనీలు నమోదు చేయాలి. దీన్ని మరింత పారదర్శకంగా మార్చి ‘సమగ్ర ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌’ను 2016 సెప్టెంబరు నుంచి అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం గుజరాత్‌లో ఉన్న ఓ కంపెనీలో యూరియా తయారు చేసి తెలంగాణలోని మారుమూల ఆదిలాబాద్‌కు రైలులో పంపితే కంపెనీ ఆన్‌లైన్‌లో ఎంత పంపారనేది నమోదు చేయాలి. రైలు నుంచి దించి టోకు, చిల్లర వ్యాపారులకు ఎరువులు చేరగానే వారూ వివరాలు పొందుపరచాలి. అందుకోసం ప్రతి చిల్లర వ్యాపారికి ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌’(పాస్‌) యంత్రం ఇచ్చారు. రైతు వేలిముద్రను, ఆధార్‌ సంఖ్యను నమోదు చేసిన తరవాతే అమ్మాలి.

ఇవన్నీ పక్కాగా పూర్తయ్యాక విక్రయాలను రాష్ట్ర వ్యవసాయశాఖ ఆన్‌లైన్‌లో ధ్రువీకరిస్తే కంపెనీకి రాయితీ సొమ్మును కేంద్ర ఎరువుల శాఖ విడుదల చేస్తోంది. ఈ పద్ధతి వల్ల దేశంలో రైతులు ఎంత ఎరువు కొన్నారన్న వివరాలు ప్రభుత్వాల చేతికందుతాయి. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్తులో రైతు బ్యాంకు ఖాతాకే ఎరువుల రాయితీ బదిలీ(డీబీటీ) విధానం తేవాలనేది కేంద్ర సర్కారు సంకల్పమని 2012లో చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా ఐఎఫ్‌ఎమ్‌ఎస్‌నే వ్యాపారులు సరిగ్గా అమలు చేయడం లేదు. నల్లబజారులో అధిక ధరలకు అమ్ముకుని మరెవరినో పిలిచి వేలిముద్ర వేయించి, ఆధార్‌ నమోదు చేసి, వారికే వేల బస్తాలు అమ్మినట్లు రాత్రికి రాత్రే నమోదు చేస్తున్నారు. ఎమ్మార్పీ ధరనే వసూలు చేసినట్లు చూపిస్తున్నారు. ఇలా అక్రమాలు బయటపడకపోవడంతో డీబీటీ విధానం ఎలా తేవాలన్నదానిపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఇందులో ఏమాత్రం తేడాలొచ్చినా వేలకోట్ల రూపాయలు దుర్వినియోగమవుతాయి.

నిరుడు ఎరువుల రాయితీల కింద కంపెనీలకు రూ.73,435 కోట్లు చెల్లించారు. యూరియాకు ఇచ్చిన రాయితీ సొమ్మే 65.83 శాతం(రూ.48,349 కోట్లు) ఉంది. దేశంలో ఎన్నో రకాల రసాయన ఎరువులను రైతులు వాడుతున్నా వాటన్నింటికీ కలిపి రాయితీ మొత్తంలో మూడోవంతే దక్కుతున్నాయి. మిగతా ఎరువులకు, యూరియా ధరలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. యూరియా ధర చాలా తక్కువగా ఉన్నందువల్ల దీనిపైనే అవినీతి జరిగి ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. 50 కిలోల డీఏపీ (డై అమ్మోనియం ఫాస్ఫేట్‌) బస్తా ధర రూ.1,250. 45 కిలోల యూరియా ధర రూ.266.50. అధిక ధరలున్న ఇతర ఎరువులు కొనడంకన్నా యూరియానే రెండుసార్లు చల్లితే పైరు పచ్చగా వస్తుందని రైతులు నమ్ముతున్నారు. దాంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. నత్రజని భూమిలో తక్కువగా ఉందని భూసార పరీక్షల్లో తేలితేనే యూరియా వాడాలి. దీన్ని రైతులు పాటించడం లేదు. వ్యవసాయశాఖ భూసార పరీక్షలు సరిగ్గా చేయకపోవడం, చేసినా ఫలితాలను సకాలంలో రైతులకు అందజేయకపోవడం వల్ల ఏ చేనుకు ఎంత ఎరువు వాడాలనే దానిపై అవగాహన ఉండటం లేదు.

రాయితీపైనే దృష్టి

ఎరువుల తయారీ, అమ్మకాల్లో రాయితీ ఎంత ఇస్తున్నాం, ఎంత తగ్గించుకోవాలనే అనే కోణంలోనే దృష్టిపెట్టి కొత్త విధానాలను కేంద్రం అమలుచేస్తోంది. దీనివల్ల రసాయన ఎరువుల వినియోగం పెరుగుతూ భూములు నిస్సారమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 19.90 కోట్ల టన్నులు వాడితే అందులో అయిదు కోట్ల టన్నుల వినియోగం మన దేశంలోనే ఉంది. మన భూములు విషపూరితం కావడానికి ఈ అధిక వాడకమే కారణమవుతోంది. అంతర్జాతీయ విపణిలో భాస్వరం ధరలు మండిపోవడం వల్ల 1977 నుంచి దేశంలో రాయితీ ఇవ్వడం మొదలైంది.

నిత్యావసరాల చట్టం కింద ఎరువుల నియంత్రణ ఆదేశాల(ఎఫ్‌సీఓ)ను 1957లో కేంద్రం జారీచేసింది. ఎరువుల రవాణా నియంత్రణ ఉత్తర్వులు 1973లో వచ్చాయి. వీటిని పక్కాగా అమలుచేస్తే కొరత రాదనేది కేంద్రం అభిప్రాయం. కానీ ఏటా ఏదో ఒక ప్రాంతంలో రైతులు కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలో యూరియా కొరత ఏర్పడింది. ఎఫ్‌సీఓ ప్రకారం ప్రతి ఎరువు బస్తాపై ఎమ్మార్పీతో పాటు, దానికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ మొత్తాన్నీ ముద్రిస్తున్నారు. ఇలా ముద్రించిన ఎమ్మార్పీకన్నా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా నిత్యావసరాల చట్టం కింద చర్యలు చేపట్టాలని ఎఫ్‌సీఓలో ఉంది. కానీ యూరియా బస్తాపై రూ.50 నుంచి రూ.100 దాకా అధికంగా వసూలు చేస్తున్నా అడిగే నాథుడే లేడు. యూరియాపై డీలర్‌కు ఇచ్చే కమీషన్‌ టన్నుకు రూ.200 నుంచి రూ.354కి 2018 ఏప్రిల్‌ ఒకటి నుంచి కేంద్రం పెంచింది. ఈ కమీషన్‌ను టోకు వ్యాపారులు తీసుకుని చిల్లర వర్తకులకు ఇవ్వడం లేదు. పైగా పల్లెలకు చేరవేయడానికి రవాణా వ్యయం అదనంగా అవుతోందని చిల్లర వ్యాపారులు రైతుల నుంచి మరింత ఎక్కువ వసూలు చేస్తున్నారు.

గ్రామస్థాయిలో వ్యవసాయాధికారులకు లంచాలిస్తే ఎరువులు ఎలా అమ్ముకున్నా వ్యాపారులను అడిగేవారే ఉండరు. ‘పాస్‌’ యంత్రంలో నమోదు చేసిన ఎరువులకే రాయితీ ఇస్తామని కేంద్రం నిబంధన పెట్టింది. దీనివల్ల ముందుగా సొమ్ము చెల్లించి ఎరువులు కొనడాన్ని వ్యాపారులు తగ్గించారు. గిరాకీ ఏర్పడి రైతులు కొనేటప్పుడే తెచ్చి ఈ యంత్రంలో నమోదు చేస్తున్నారు. దీనివల్ల పారదర్శకత పెరిగిందని కేంద్రం చెబుతోంది. కానీ డిమాండు ఎక్కువైనప్పుడు రైతులకు అవసరమైనన్ని ఎరువులు అందుబాటులో లేక కృత్రిమ కొరత సృష్టించి, ధరలు పెంచి, వారిని దోచేస్తున్నారు. ‘పాస్‌’ యంత్రాలు అమలులోకి వచ్చాక మొదలైన కొత్త దోపిడి విధానమిది. ఎనిమిదేళ్లలో ఎరువుల అమ్మకాలు పెరిగినందువల్ల మొత్తంగా చూస్తే నిధుల కేటాయింపు తగ్గలేదు. కానీ ఓట్ల రాజకీయం వల్లనే యూరియాపై ఇచ్చే రాయితీ నిధులు 107 శాతం అధికమైంది. ఇతర ఎరువులకిచ్చే రాయితీలను ఏకంగా 40 శాతం కోత పెట్టడంతో వాటి ధరలు పెచ్చరిల్లి రైతులపై ఆర్థికభారం ఎక్కువైంది.

భూసార పరీక్షలు పక్కాగా చేయించి ప్రతి రైతు కమతంలో తక్కువగా ఉన్న పోషకాలనే విక్రయించే విధానం వస్తే మేలు. దీనివల్ల ఎరువుల రాయితీకి ఇస్తున్న సొమ్ములో నాలుగోవంతు ఇచ్చినా దేశమంతా భూసార పరీక్షలు ఏడాదిలో పూర్తిచేయడానికి అవకాశముంది. అది జరగడం లేదు. ఎరువుల వినియోగం పెరుగుతున్న స్థాయిలో పంటల ఉత్పాదకత ఉండటం లేదు. అధిక రసాయనాల వాడకం వల్ల భూములు నిస్సారమైపోతున్నాయి. దీనివల్ల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడనుంది!

- మంగమూరి శ్రీనివాస్​

ఇదీ చూడండి: కశ్మీర్​లో రెచ్చిపోయిన ముష్కరులు-ఐదుగురు మృతి

RESTRICTION SUMMARY: PART MUST CREDIT KABC, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KABC – MUST CREDIT KABC, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Los Angeles – 29 October 2019
1. Officials enter news conference in front of fire truck
2. SOUNDBITE (English) Mayor Eric Garcetti, (D) Los Angeles:
"This was, simply put, in plain parlance, an act of God. That the wind broke off a tree branch, threw that tree branch because of these strong winds, far enough to cause a spark off a line that is still intact there, but you can see a little bit of the damage on it, most likely caused those sparks to fall and begin this fire. And then we were off to the races."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Los Angeles – 29 October 2019
3. Truck drives by fire damaged home
KABC – MUST CREDIT, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Los Angeles – 29 October 2019
4. SOUNDBITE (English) Chief Ralph Terrazas, Los Angeles Fire Department:
"So I'm very confident in the results that our arson investigators came up with. It is an accidental cause. There is no evidence of homeless encampment. No evidence of arson. It is an accidental start."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Los Angeles – 29 October 2019
5. Burned-out home
KABC – MUST CREDIT, NO ACCESS LOS ANGELES, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Los Angeles – 29 October 2019
6. SOUNDBITE (English) Mayor Eric Garcetti, (D) Los Angeles:
"This is hot air that's being pushed from the desert drying out these canyons for the last few days. Combine that with the extreme wind that we will have and humidity which is now expected tomorrow to drop into the single digits. This is a terribly dangerous moment."
7. Board with map of fire
STORYLINE:
A wildfire that erupted Monday and destroyed a dozen homes in the star-studded Brentwood area of Los Angeles probably erupted when Santa Ana winds drove a dried eucalyptus tree branch into a Department of Water and Power line, causing it to arc and spark, officials said.
The branch traveled some 30 feet (9 metres) and the power line and pole didn't fall or fail, officials said, noting that investigators are trying to determine who owns the land where the tree stands.
The fire that ignited on a hillside near the J. Paul Getty Museum drove residents as well as celebrities like LeBron James and Arnold Schwarzenegger from their homes.
The fire was reduced to smoldering hot spots by Tuesday but about 9,000 people remained under evacuation orders and firefighters warned that hot, dry winds were due to return Tuesday night, possibly at increasing strength, bringing with them the chance of reigniting the blaze.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.