పెంపుడు శునకంపై ఉన్న అతి ప్రేమ ఓ యువతిని ప్రాణాలు తీసుకునేలా చేసింది. తన పెంపుడు శునకం మరణించిన వార్త జీర్ణించుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో జరిగింది.
రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంశు సింగ్(21) పీజీ చదువుతోంది. మంగళవారం రాత్రి తన పెంపుడు శునకం మరణించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. శునకాన్ని ఖననం చేసిన ఆ తర్వాతి రోజు ఉదయాన్నే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కోట్ర పోలీస్‌స్టేషన్ అధికారి చమన్ సిన్హా తెలిపారు.
లేఖ రాసి..
ఆందోళనతో కుటుంబసభ్యులు ఆమె గదిలోకి వెళ్లి పరిశీలించగా ఓ లేఖ దొరికింది. అందులో ఆమె తనను తన శునకంతో పాటే ఖననం చేయాలని పేర్కొన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:రూ. 35 కోట్ల విలువైన బంగారం పట్టివేత