సుప్రీంకోర్టులో కలకలం రేగింది. న్యాయస్థానం ప్రాంగణంలో ఓ అనుమానిత బ్యాగు కనిపించింది. అందులో నుంచి 'బీప్ బీప్' అంటూ శబ్దాలు రాగా... చుట్టుపక్కలున్న వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బ్యాగులో ఏముందో తెలుసుకునేందుకు విస్తృత తనిఖీలు చేపట్టారు.
పోలీసులు ధైర్యం చేసి బ్యాగును తెరిచి చూశారు. అందులో ఓ పవర్ బ్యాంక్ మాత్రమే ఉందని గుర్తించి, ఊపిరి పీల్చుకున్నారు.
బ్యాగును జప్తుచేసి తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఎవరో ఆ బ్యాగును మర్చిపోయి వెళ్లుంటారని చెప్పారు.