రెండేళ్లుగా పన్ను చెల్లించకుండా, రోడ్డు రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తూ బస్సు నడుపుతున్న ఓ వ్యక్తికి అధికారులు రూ.6,72,445 భారీ జరిమానా విధించిన ఘటన ఒడిశా బౌధ్‌లో జరిగింది.
ఒడిశా ప్రభుత్వం మార్చి 1 నుంచి మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 'మినార్' అనే ప్రైవేటు బస్సును అధికారులు తనిఖీ చేశారు. ఆ బస్సు యజమాని రెండేళ్లుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను కట్టలేదని గుర్తించారు. అంతేకాకుండా ఆ వాహనంపై పలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయి. కనీసం బస్సుకు సంబంధించి పత్రాలు కూడా వారి వద్ద లేవు. ఫలితంగా అధికారులు బస్సు యజమానికి భారీ జరిమానా విధించారు.
ఇదీ చూడండి: యెస్ బ్యాంక్‌పై మారటోరియం- సగం వాటా ఎస్బీఐకి!