చైనా సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇటీవలే వాస్తవాధీన రేఖ వెంబడి చైనా హెలికాప్టర్లు చెక్కర్లు కొట్టగా.. తాజాగా చాపర్లు అంతర్జాతీయ సరిహద్దును దాటి ఏకంగా భారత భూభాగంలోకి 12కిలో మీటర్ల మేర చొచ్చుకొచ్చాయి. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లోని లాహౌత్ స్పితి వద్ద ఆదివారం జరిగింది.
అప్రమత్తమైన స్థానిక పోలీసులు.. సైనిక నిఘా వ్యవస్థ, ఐటీబీపీకు సమాచారం అందించాయి. చాపర్లు తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు స్థానిక పోలీసులు వివరించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టింది భారత సైన్యం.
లాహౌత్ స్పితి వద్ద చైనా హెలికాప్టర్లు చొరబడటం ఒకటిన్నర నెలల్లో ఇది రెండోసారి అని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:వధూవరులకు వెండి 'మాస్క్' ఆభరణం!