ETV Bharat / bharat

కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం

కొవిడ్​ కారణంగా మనుషుల మధ్య దూరం అంతకంతకూ పెరిగిపోతున్న వేళ పేదల ఇంటికి వెళ్లి వైద్య సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓ వైద్యుడు. మహారాష్ట్రలోని చంద్రపుర్​ జిల్లాలో రోజూ సైకిల్​ తొక్కుకుంటూ వెళ్లి గ్రామప్రజల బాగోగులు చూస్తున్నారు ఆ డాక్టర్.

A 87-year old homoeopathic doctor in Maharashtra braves COVID-19 pandemic to treat villagers
కరోనా కాలంలోనూ.. ఇంటింటికీ తిరిగి వైద్యం చేస్తున్నాడీ డాక్టర్​
author img

By

Published : Oct 23, 2020, 3:14 PM IST

Updated : Oct 23, 2020, 5:25 PM IST

కరోనా సంక్షోభం ఆర్థిక స్థిరత్వాన్నే కాదు.. మానవ సంబంధాలను దెబ్బతీసింది. ఇంట్లో ఎవరికైనా కరోనా వస్తేనే భయపడుతూ దూరం పెడుతున్నారు కుటుంబ సభ్యులు. అలాంటిది కొవిడ్​ కాలంలోనూ ఇంటింటికీ తిరిగి చికిత్స చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మహారాష్ట్రకు చెందిన ఓ హోమియోపతి వైద్యుడు. 87 ఏళ్ల వయసులోనూ 10 కిలోమీటర్లు సైకిల్​పై ప్రయాణించి చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు డాక్టర్​ రామచంద్ర దణేకర్​.

కరోనా కాలంలోనూ ఇంటింటికీ తిరిగి వైద్యం
A 87-year old homoeopathic doctor in Maharashtra braves COVID-19 pandemic to treat villagers
సైకిల్​పై వెళ్తున్న డాక్టర్​ రామచంద్ర దణేకర్​

హోమియోపతి వైద్య ధ్రువీకరణ పత్రం

చంద్రపుర్​ జిల్లాకు చెందిన రామచంద్ర కనీసం చెప్పులు కూడా వేసుకోరు. పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఊరూరా తిరుగుతూ 60 ఏళ్లుగా ఇలానే వైద్య సేవలందిస్తున్నారు. కొవిడ్​ కారణంగా పేదలకు చికిత్స చేసేందుకు కొంతమంది వైద్యులు వెనుకడుగు వేస్తున్న తరుణంలో.. నేనున్నానంటూ ధైర్యంతో ముందుకొచ్చి తన వృత్తికి న్యాయం చేస్తున్నారీ డాక్టర్​.

ఇదీ చదవండి: దేశంలో 7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు

Last Updated : Oct 23, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.