ETV Bharat / bharat

స్కార్పియో, ట్రక్కు ఢీ- తొమ్మిది మంది మృతి

9 died in collision of scorpio with truck in pratapgarh who was going to bihar
ఘోర ప్రఘోర ప్రమాదం- తొమ్మిది మంది మృతిమాదం
author img

By

Published : Jun 5, 2020, 9:08 AM IST

Updated : Jun 5, 2020, 11:08 AM IST

09:04 June 05

స్కార్పియో ట్రక్కు ఢీ- తొమ్మిది మంది మృతి

స్కార్పియో, ట్రక్కు ఢీ

ఉత్తర్​ప్రదేశ్ ప్రతాప్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  స్కార్పియో ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది దుర్మరణం చెందారు. వీరంతా రాజస్థాన్​ నుంచి బిహార్​లోని తమ సొంత ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ ఘటనలో స్కార్పియో నుజ్జునుజ్జయింది.

ఉదయం 6 గంటల సమయంలో నవాబ్​గంజ్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని వాజిద్​పుర్​లో లఖ్​నవూ-ప్రయాగ్​రాజ్ హైవేపై ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారిలో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు చెప్పారు.

అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు చాలా ఇబ్బంది పడినట్లు పేర్కొన్నారు. కాసేపు అక్కడ ట్రాఫిక్​కు అంతరాయం కలిగినట్లు తెలిపారు.

ఉదయం భారీ వర్షం కురుస్తోన్న కారణంగా స్కార్పియోను డ్రైవర్ అదుపు చేయలేక పోయినట్లు పోలీసులు చెప్పారు. ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

Last Updated : Jun 5, 2020, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.