ETV Bharat / bharat

8 నెలల గర్భిణి.. అయినా విధులకు హాజరైన ఎస్​ఐ - మే 3

కరోనాపై పోరాడేందుకు వైద్యులు, పోలీసులు చేస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. ఈ సంక్షోభ సమయంలో 8 నెలల గర్భంతో ఉండి కూడా విధులకు హాజరవుతున్నారు ఒడిశాలోని ఓ పోలీసు అధికారిణి. ఆమె నిబద్ధతను చూసి ఆ రాష్ట్ర డీజీపీ అభినందించారు.

8 months pregnant police sub inspector are on duty during this corona crisis period
కరోనాపై సమరానికి విధుల్లో ఎనిమిది నెలల గర్భిణీ
author img

By

Published : Apr 23, 2020, 7:40 PM IST

కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం గస్తీ కాస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఒడిశాలో ఓ మహిళా సబ్​ఇన్​స్పెక్టర్​ అంతకు మించి అన్న రీతిలో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. 8 నెలల గర్భంతో ఉన్నా విధులకు హాజరవుతున్నారు.

8 months pregnant police sub inspector are on duty during this corona crisis period
కరోనాపై సమరానికి విధుల్లో ఎనిమిది నెలల గర్భిణీ

ఇంతకీ ఆమె ఎవరంటే!

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించగా.. సక్రమంగా అమలు చేయడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఒడిశా మయూరభంజ్​ జిల్లా బేతానాటి పోలీస్​ స్టేషన్​లో మహిళా సబ్​ఇన్​స్పెక్టర్​ మమతా మిశ్రా 8 నెలల గర్భిణి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మమతా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా విధులకు హాజరవుతున్నారు. ఈ మేరకు మయూరభంజ్​ను సందర్శించిన ఒడిశా డీజీపీ అభయ్​ ఈ విషయాన్ని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో కడుపులో బిడ్డను మోస్తూ విధులకు హాజరైన మమత ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు.

" కరోనాను వంటి సంక్షోభ పరిస్థితుల్లో పోలీసులు, వైద్యులు, నర్సులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సమయంలో ఓ పోలీసు అధికారిగా నేనేందుకు చేయకూడదు అని భావించి గర్భిణిగా ఉన్నప్పటికీ విధుల్లో చేరా. మహమ్మారి వ్యాప్తిని అందరం ఓ సవాలుగా తీసుకొని నివారించాల్సిన అవసరం ఉంది. నా ఆరోగ్యం సహకరించే వరకు విధులు నిర్వర్తిస్తూ ఉంటా. నా సహోద్యోగులు ఎంతో సహకరిస్తున్నారు. మే 3న లాక్​డౌన్​ ఎత్తివేసిన తర్వాత సెలవులు తీసుకుంటా."

-- మమతా మిశ్రా, ఎస్​ఐ ఒడిశా

  • During my Mayurbhanj visit yesterday I met SI Mamta Mishra .This braveheart in eighth month of pregnancy insists on working .In view of her health ,she is given duty at Betnoti PS and not on road or checkpoint.
    My compliments to her .#coronawarriors #womanpower pic.twitter.com/ldSIcL7WeN

    — DGP, Odisha (@DGPOdisha) April 22, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: అందమైన కురుల కోసం ఈ చిట్కాలు పాటించండి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.