ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఉన్నావ్ ఎస్హెచ్ఓతో పాటు మరో ఆరుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.
అసలేమైందంటే..
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు విచారణ కోసం కోర్టుకు వెళ్తున్న సమయంలో నిందితులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు.. శుక్రవారం రాత్రి కన్నుమూసింది.
ఈ నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఏడుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.