ఒడిశాలో మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. వరద బీభత్సానికి ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
![7 died, 2 missing as heavy rains triggers flood-like situation in Odisha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8588456_1.jpg)
మృతి చెందిన వారిలో నలుగురు మయూర్ భంజ్ వాసులు కాగా.. ఇద్దరు కియోంగఢ్, మరొకరు సుందర్‌గఢ్ ప్రాంతాలకు చెందినవారు.
విరిగిపడిన కొండచరియలు..
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని లంబాగర్, భన్నేర్పాణీ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు.
మరికొన్ని చోట్ల..
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ ప్రాంతంలో సింఘ్పుర్ బ్యారేజీ వద్ద నీటి మట్టం పెరగడం వల్ల సాధారణ జన జీవనం స్తంభించిపోయింది.
![People's lives frozen in Madhya Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8588456_50_8588456_1598605026242.png)
![People's lives frozen in Madhya Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8588456_86_8588456_1598604998630.png)
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్ జిల్లాలో వరదలు పోటెత్తాయి. అనేక ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.
![Extraction of flood in Chhattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8588456_41_8588456_1598605052962.png)
ఇదీ చదవండి: రెండు భవనాలు కూలి నలుగురు మృతి