వ్యవసాయ బిల్లులపై విపక్షాలు చేస్తున్న నిరసనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎండగట్టారు. ప్రస్తుతం ఆందోళన బాట పట్టిన పార్టీలు కూడా ఇదే తరహా బిల్లులు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాయని అన్నారు. ఓట్లపై అధికంగా శ్రద్ధ పెట్టి వీటిని అమలు చేయలేకపోయాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లినట్లు చెప్పారు మోదీ.
హిమాచల్ ప్రదేశ్ మనాలీలో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న మోదీ.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇలాంటి సంస్కరణలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
"రైతులు పాత కాలంలోనే ఉండిపోవాలని చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీలు భావిస్తున్నాయి. ఎప్పుడూ రాజకీయ లబ్ధి కోసం పనిచేసే వారికి మా సంస్కరణలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మేం తీసుకొచ్చిన చట్టాలు మధ్యవర్తులపై ప్రభావం చూపిస్తుండటం వల్ల వారు దిగజారిపోతున్నారు. శతాబ్దం మారిపోయినా వారి(విపక్షాల) ఆలోచనా విధానం మారలేదు. గత శతాబ్దపు ఆలోచనా విధానంతో తర్వాతి శతాబ్దంలోకి అడుగుపెట్టలేరు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
సంస్కరణల్లో భాగంగా సేవలను డిజిటలీకరణ చేయడం సహా, నేరుగా నగదు బదిలీ వల్ల చాలా సమయం ఆదా అవుతోందని అన్నారు మోదీ. క్షేత్ర స్థాయిలో అవినీతి తగ్గిపోయిందని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తగ్గించేందుకే నిరంతరం పోరాడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇటీవల పార్లమెంట్ ఆమోదం పొందిన లేబర్ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. ఇదివరకు దేశంలోని ఆడబిడ్డలకు కొన్ని రంగాల్లో పనిచేసేందుకు అనుమతి ఉండేది కాదని, ఈ చట్టాల ద్వారా మగవారితో సమానంగా వేతనం, హక్కులు అనుభవించే అవకాశం లభించిందని అన్నారు.
హిమాచల్ ప్రజల కోసం...
అటల్ టన్నెల్ ప్రారంభంతో పాటు హిమాచల్ ప్రదేశ్ ప్రజల కోసం మరో పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు మోదీ చెప్పారు. హమీర్‌పుర్‌లో 66 మెగా వాట్ల ధౌలసిద్ధ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల దేశానికి విద్యుత్ సరఫరా అందడమే కాకుండా, స్థానిక యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుందని పేర్కొన్నారు.
-
#WATCH Himachal Pradesh: PM Narendra Modi asks his medical team to assist a woman security personnel who fell unwell while on duty at the public rally at Solang Nala in Manali.
— ANI (@ANI) October 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
PM said, "Please take her from there & make her sit. Ask our medical team to help her." pic.twitter.com/RgTltHViVq
">#WATCH Himachal Pradesh: PM Narendra Modi asks his medical team to assist a woman security personnel who fell unwell while on duty at the public rally at Solang Nala in Manali.
— ANI (@ANI) October 3, 2020
PM said, "Please take her from there & make her sit. Ask our medical team to help her." pic.twitter.com/RgTltHViVq#WATCH Himachal Pradesh: PM Narendra Modi asks his medical team to assist a woman security personnel who fell unwell while on duty at the public rally at Solang Nala in Manali.
— ANI (@ANI) October 3, 2020
PM said, "Please take her from there & make her sit. Ask our medical team to help her." pic.twitter.com/RgTltHViVq
కొవిడ్ నేపథ్యంలో కార్యక్రమానికి తక్కువ మందికే అనుమతిచ్చారు. సభికులు వ్యక్తిగత దూరం పాటించేలా సీట్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. భౌతిక దూరం నిబంధనలు చక్కగా అమలు చేస్తున్నారని కొనియాడారు. మోదీ ప్రసంగిస్తుండగా ఓ మహిళా భద్రత సిబ్బంది స్పృహ తప్పి పడిపోయారు. ప్రసంగం మధ్యలో ఆపేసిన మోదీ.. చికిత్స అందించాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి- 'అటల్ టన్నెల్.. సరిహద్దుల్లో ప్రపంచస్థాయి సొరంగమార్గం'