ETV Bharat / bharat

దిల్లీ దంగల్​: 62.59శాతం పోలింగ్ ​నమోదు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 62.59శాతం పోలింగ్ నమోదైనట్లు దిల్లీ ఎన్నికల ప్రధానాధికారి రణ్​బీర్​ సింగ్​ ప్రకటించారు. తుది పోలింగ్​ శాతాన్ని ప్రకటించకపోవడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. జాప్యానికి గల కారణాలను కూడా వెల్లడించారు రణ్​బీర్​​.

author img

By

Published : Feb 9, 2020, 8:40 PM IST

Updated : Feb 29, 2020, 7:11 PM IST

62-dot-59-pc-voter-turnout-in-delhi-election-poll-officials
దిల్లీ దంగల్​: 62.59శాతం పోలింగ్ ​నమోదు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్​ శాతాన్ని ప్రకటించింది ఎన్నికల సంఘం(ఈసీ). దేశ రాజధానిలోని మొత్తం 70 స్థానాల్లో 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు దిల్లీ ఎన్నికల ప్రధానాధాకారి రణ్​బీర్​ సింగ్​ స్పష్టం చేశారు. అత్యధికంగా బల్లీమారాం నియోజకవర్గంలో 71.6 శాతం.. దిల్లీ కంటోన్మెంట్​లో​ అత్యల్పంగా 45.04 శాతం పోలింగ్​ నమోదైనట్లు వెల్లడించారు.

పోలింగ్​ ముగిసి గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతాన్ని వెల్లడించకపోవడంపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ తాజాగా ఈసీ అధికారులను ప్రశ్నించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన అధికారులు.. జాప్యానికి గల కారణాలతో పాటు నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతాన్ని ప్రకటించారు.

4.88శాతం తగ్గుదల..
లోక్​సభ ఎన్నికల కంటే అసెంబ్లీ పోరులో 2శాతం మంది అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు రణ్​బీర్. అయితే 2015లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు 4.88శాతం పోలింగ్ తగ్గినట్లు పేర్కొన్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 29, 2020, 7:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.