గుజరాత్ జునాగఢ్ జిల్లా ఉనా తాలుకా సంఖడా గ్రామంలో ఓ వృద్ధ జంట వివాహం.. స్థానికులకు కనువిందు చేసింది.
60 ఏళ్ల నితిన్‌భాయ్.. 1990లో కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక వ్యాపార నిమిత్తం జర్మనీలోని హిల్జెన్బర్గ్కు వెళ్లిపోయాడు. 2002లో ఓ పనిమీద మారిషస్ దేశానికి వెళ్లాడు. అక్కడే.. నితిన్‌కు జర్మనీకి చెందిన ఎలెన్ కలిసింది. ఆ తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
ముచ్చటగా మూడు సార్లు..
ఎనిమిదేళ్లు గాఢమైన ప్రేమలో మునిగి తేలాక.. 2010 జనవరి 22న అహ్మదాబాద్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో తొలిసారిగా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు జర్మనీ సంప్రదాయం ప్రకారం మరో సారి వివాహమాడారు. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేయలేదు కాబట్టి ఆ ముచ్చటా తీర్చుకోవాలనుకున్నారు. అందుకే గత బుధవారం తమ పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. హిందూ ఆచారాల ప్రకారం ముచ్చటగా మూడోసారి ఒక్కటయ్యిందీ జంట.
ఇదీ చదవండి: దిల్లీ దంగల్: 'కామ్ కీ చాయ్'తో ఆప్ నయా ప్రచారం