ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అధికారులు.
![6 people died on the spot in a road accident in Siddharthanagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-sid-01-durghatna-pkg-upc10140_16112020102422_1611f_1605502462_837.jpg)
![6 people died on the spot in a road accident in Siddharthanagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/up-sid-01-durghatna-pkg-upc10140_16112020102422_1611f_1605502462_991.jpg)
బిహార్‌లోని ముదాన్ వేడుకకు కారులో వెళ్తుండగా.. మధుబాని వద్ద మలుపు తిప్పుతూ డివైడర్‌ను ఢీకొంది ఓ కారు. మంచుకురుస్తున్న వేళలో... అతివేగంగా కారు నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
మృతదేహాలను శవపరీక్షకు తరలించారు పోలీసులు.
ఇదీ చూడండి: నదిలో పడిన వాహనం- ఏడుగురు మృతి