ETV Bharat / bharat

'6.39% మందికే ఆస్పత్రుల్లో చికిత్స అవసరం' - Corona virus recovery rate in India

దేశంలో ఉన్న కరోనా రోగుల్లో 6.39శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొవిడ్​-19 నుంచి కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 39.62కి పెరిగిందని తెలిపింది.

6.39 per cent of total active COVID-19 cases needed hospital support: Health ministry
'6.39 శాతం మందికే ఆస్పత్రుల్లో చికిత్స అవసరం'
author img

By

Published : May 20, 2020, 7:52 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల్లో 6.39 శాతం మందికే ఆస్పత్రుల్లో వైద్యం అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిలో 2.94శాతం మందికి ఆక్సిజన్​, 3 శాతం మందికి ఐసీయూ, మిగిలిన 0.45శాతానికి వెంటిలేటర్లు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​​ తెలిపారు.

7.9మంది మాత్రమే

ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 42,298 మంది కోలుకోగా... 61,149 మంది చికిత్స పొందుతున్నారని లవ్​ అగర్వాల్​ వెల్లడించారు. లాక్​డౌన్​ అమలు చేసిన మొదట్లో 7.1శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 39.62కు పెరిగిందని తెలిపారు.

దేశంలో కరోనా వల్ల ప్రతి లక్ష మందిలో 7.9 మంది మాత్రమే ప్రభావితమయ్యారని ఆరోగ్య శాఖ పేర్కొంది.

నిషేధించే యోచనలో ఉందా?

కొవిడ్​-19 చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిషేధించే యోచనలో ప్రభుత్వం ఉందా? అనే ప్రశ్నకు... మలేరియా ఔషధం సమర్థతపై సమీక్ష నిర్వహిస్తామని భారతీయం వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) సమాధానమిచ్చింది.

ఇదీ చూడండి: 'మీడియాకు ప్రభుత్వాల బకాయిలు రూ.1,800 కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.