ETV Bharat / bharat

ఉపాధి హామీ పనుల్లో మహిళలదే పైచేయి! - 50.75% participation of women in MNREGA, highest in last four years

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్​ఆర్ఈజీ​ఏ)-2005 కింద ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 50.75 శాతంతో 24.28 లక్షల మంది మహిళలకు ఉపాధి లభించింది. నాలుగేళ్ల గణాంకాలు చూస్తే ఇదే అత్యధికం. వచ్చే నాలుగు నెలల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Half of the Population has more than 50 percent participation in MNREGA
ఆ రాష్ట్రంలో 'ఎంఎన్​ఆర్​ఈజీఏ' కింద సగానికి పైగా స్త్రీలే!
author img

By

Published : Jul 29, 2020, 8:12 AM IST

కరోనా మహమ్మారితో అన్ని రంగాలు కుదేలయ్యాయి. వలస కూలీలు పని లేక స్వరాష్ట్రాలకు వెళ్లారు. ప్రస్తుతం వారికి ఉపాధి హామీ పనే పెద్ద ఆసరాగా నిలుస్తోంది. ఛత్తీస్​గఢ్​లో ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల కాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్​ఆర్ఈజీ​ఏ) కింద 50.75 శాతం మంది మహిళలు ఉపాధి పొందారు. గడిచిన నాలుగేళ్లలో మహిళలకు ఎంఎన్​ఆర్ఈజీ​ఏ కింద ఇంత భారీ స్థాయి పని దినాలు కల్పించడం ఇదే తొలిసారి. తొలి నాలుగు నెలల్లో ఈ పథకం కింద 24,28,234 మంది మహిళలకు ఉపాధి లభించింది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సంఖ్య మరింత పెరగనుందని అధికారులు అంచనావేస్తున్నారు.

ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 9,17,87000 పని దినాలు కల్పించగా.. అందులో స్త్రీలకు ప్రత్యేకంగా 4,65,85000 రోజులు కేటాయించారు.

Half of the Population has more than 50 percent participation in MNREGA
ఎంఎన్​ఆర్​ఈజీఏ పథకం కింద ఉపాధి పొందుతున్న వారిలో సగానికి పైగా స్త్రీలే

సగానికి పైగా స్త్రీలే..

ఛత్తీస్​గఢ్​లో ఈ ఏడాది ఎంఎన్​ఆర్​ఈజీఏ కింద.. మొత్తం 48,14,330 మంది కూలీలకు ఉపాధి కల్పించింది ప్రభుత్వం. వీరిలో సగానికి పైగా 50.75 శాతం(24,28,234)మంది మహిళా కార్మికులే ఉండటం గమనార్హం.

మహిళా భాగస్వామ్యం..

రాష్ట్రంలో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతోంది. 2016-17, 2017-18లో 49.31 శాతం ఉండగా.. 2018-19లో అది 50.05 శాతానికి పెరిగింది. ప్రస్త్తుత ఆర్థిక ఏడాదికి 50.75 శాతానికి చేరుకుంది.

ఎంఎన్​ఆర్ఈజీ​ఏ నిబంధనల ప్రకారం.. ఈ పథకంలో భాగంగా కనీసం మూడింట ఒక వంతు ఉపాధిని మహిళలకు తప్పనిసరిగా కేటాయించాలి.

ఇదీ చదవండి: 'మా ఊర్లో కరోనా లేదు.. వెళ్లిపోండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.