ETV Bharat / bharat

రెండు రోడ్డు ప్రమాదాల్లో 10మంది మృతి - Uttarpradesh car accident news updates

వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మరణించారు. బిహార్​లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఉత్తర్​ప్రదేశ్​లో కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొన్న ఘటనలో మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

5 people died in road accident in sant kabir nagar
రెండు రోడ్డు ప్రమాదాల్లో -10మంది మృతి
author img

By

Published : Nov 15, 2020, 2:34 PM IST

బిహార్​లో భాగల్​పుర్​లోని​ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రును స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఉత్తర్​ప్రదేశ్​లో కారు...

ఉత్తర్​ప్రదేశ్​ సంత్​ కబిర్​ నగర్​ జిల్లా​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ఆగిఉన్న ట్రక్కుపైకి దూసికెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతులంతా దేవరియా జిల్లా వాసులుగా అధికారులు గుర్తించారు.

సౌదీ నుంచి వచ్చిన ఇద్దరు బంధువులను తీసుకొని లఖ్​నవూ నుంచి దేవరియా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ఇదీ చూడండి: కన్నతల్లిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.