హరియాణాలో విషాదం చోటుచేసుకుంది. అంబాలా కంటోన్మెంట్‌లోని మురికివాడలో గోడ కూలి ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మృతిచెందారు. వీరందరు రోజువారీ కూలీలే.
డ్రైనేజ్ వ్యవస్థే కారణం...
ఘటనాస్థలం పక్కనే ఓ బహుళ అంతస్తుల పార్కింగ్ స్థలాన్ని నిర్మిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ పనులు జరుగుతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థలోనూ మార్పులు చేశారు. కానీ ఆ డ్రైనేజ్ నీరు మెల్లిగా గోడలోకి చేరింది. దీని వల్ల గోడలో పగుళ్లు ఏర్పడ్డాయి. శుక్రవారం రాత్రి.. పక్కనే ఉన్న మురికివాడపై గోడ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఘటనాస్థలంలో 12 మంది ఉన్నారు. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. వీరందరూ టీవీ చూస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:- నవరాత్రి స్పెషల్: సూరత్‌లో 'మోదీ' నృత్యం..!