తమిళనాడులో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 4,985 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 1,75,678 కు చేరింది. మరో 70 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,551 కు పెరిగింది. కొత్తగా మరో 3,861 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,21,776 మందికి వైరస్ నయమైంది.
ఆ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 52,087 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 20 లక్షలకు చేరువైంది.
దిల్లీలో కేసులు ఇలా..
దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 954మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,23,747 కు చేరింది. మరో 35 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 3,663 కు పెరిగింది. నేడు 1,784 మందికి వైరస్ నయం కాగా.. మొత్తంగా 1,04,918 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
ఇదీ చదవండి: పేడ కొనే పనిలో ప్రభుత్వం- కిలో రూ.2