ETV Bharat / bharat

భారత్​కు టెస్టింగ్ కిట్లు- 55 దేశాలకు మలేరియా మందు

కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ దేశాల నుంచి టెస్టింగ్ కిట్లను భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోనుంది. ఇప్పటికే చైనా నుంచి కిట్లు భారత్​ కొనుగోలు చేయగా.. అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జపాన్ తదితర దేశాల నుంచి కిట్లు దిగుమతి చేసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. అటు హైడ్రాక్సీక్లోరోక్విన్​ సరఫరా చేయాలని కోరుతూ భారత్​ను అభ్యర్థించిన 55 దేశాలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

testing kits
టెస్టింగ్ కిట్లు
author img

By

Published : Apr 16, 2020, 8:48 PM IST

కరోనా కట్టడికి భారత్ చర్యలు మరింత ముమ్మరం చేసింది. ఇందుకోసం వివిధ దేశాల సహాయం కోరనుంది. కరోనాను నివారించేందుకు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడమే అత్యుత్తమ ఉపాయమని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో టెస్టింగ్ కిట్ల కొరత లేకుండా కేంద్రం జాగ్రత్త పడుతోంది. ఆరు వారాలకు సరిపడా కిట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. మరిన్ని కిట్లను సమీకరించడానికి కసరత్తులు ప్రారంభించింది.

ఇందుకోసం పలు దేశాల నుంచి పరీక్ష కిట్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పటికే చైనా నుంచి 6.5 లక్షల కిట్లను దిగుమతి చేసుకున్న భారత్.. 15 రోజుల్లో మరో 20 లక్షలకు పైగా కిట్లను పొందనుంది.

చైనాతో పాటు దక్షిణ కొరియా నుంచి సైతం కిట్ల కొనుగోలుకు భారత్ సమ్మతి తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. జర్మనీ, అమెరికా, బ్రిటన్, యూకే, మలేసియా, జపాన్, ఫ్రాన్స్ దేశాల నుంచి కిట్లతో పాటు కరోనా పోరాటానికి కావాల్సిన వైద్య పరికరాలు దిగుమతి చేసుకోనున్నట్లు తెలిపారు.

55 దేశాలకు అనుమతి

మరోవైపు 55 దేశాలకు భారత్​ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఔషధాన్ని 21 దేశాలకు వాణిజ్యపరంగా అందించనున్నట్లు తెలిపారు. మిగిలిన దేశాలకు మానవతా దృక్పథంతో గ్రాంటు కింద చిన్న మొత్తాల్లో సరఫరా చేయనున్నట్లు స్పష్టం చేశారు.

తొలి జాబితాలో ఉన్న అమెరికా, బ్రెజిల్, జర్మనీ, అఫ్గానిస్థాన్, నేపాల్ దేశాలకు ఇప్పటికే డ్రగ్ సరఫరా చేయగా.. ఇతర దేశాలకు చేస్తోన్న ఎగుమతి పలు దశల్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మూడో జాబితాలో ఉన్న యూఏఈకి సైతం ఈ డ్రగ్ సరఫరా చేయడానికి విదేశాంగ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. అయితే హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం పాకిస్థాన్​ నుంచి అభ్యర్థన వచ్చిన విషయంపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు.

విదేశీయులు వెనక్కి

53 దేశాల్లో కలిపి ఇప్పటివరకు 3,336 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. అందులో 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 48 దేశాలకు చెందిన 35 వేల మంది విదేశీయులను స్వస్థలాలకు చేరవేసినట్లు వెల్లడించారు. 41 మంది పాకిస్థానీలను ఈ రోజు అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా ఆ దేశానికి పంపించినట్లు చెప్పారు. మరో 145 మంది పాకిస్థానీలు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

'హెల్ప్'​లైన్

24 గంటల కొవిడ్ హెల్ప్​లైన్ ద్వారా వచ్చిన 5 వేల ఫోన్ కాల్స్​కు విదేశాంగ శాఖ అత్యవసర విభాగం స్పందించినట్లు అధికారులు తెలిపారు. 2 వేల ప్రజా సమస్యలు సహా వైద్య సహాయం కోసం వచ్చిన 18 వేల ఈమెయిళ్లను పరిష్కరించినట్లు స్పష్టం చేశారు.

బ్రిక్స్ దేశాల వర్చువల్ సమావేశం ఈ నెల చివర్లో జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.