ETV Bharat / bharat

పిడుగుపాటు ఘటనల్లో ఒక్క రోజే 31 మంది మృతి

బిహార్, ఉత్తర్​ ప్రదేశ్​ రాష్ట్రాల్లో గురువారం పిడుగు పాటు ఘటనలు సంభవించి మరణించిన వారి సంఖ్య 31కి పెరిగింది. రెండు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదాలు జరిగాయి. బిహార్​లో మరణించిన 26మంది కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా సంతాపం తెలిపారు.

31 people dead in ligtning incidents across bihar,up
పిడుగుపాటు ఘటనల్లో ఒక్క రోజే 31 మంది మృతి
author img

By

Published : Jul 3, 2020, 4:59 AM IST

ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగుపాటు ఘటనలు సంభవించి గురువారం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 31కి పెరిగింది.

బిహార్​లో 26మంది...

బిహార్ వ్యాప్తంగా గురువారం వివిధ ప్రాంతాల్లో సంభవించిన పిడుగుపాటు ఘటనల్లో 26మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతి పట్ల కేంద్ర హోంమత్రి అమిత్​ షా విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.

బిహార్​లో గత వారం రోజుల్లోనే పిడుగు పాటు ఘటనల వల్ల 100మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించింది నితీశ్​ కుమార్ ప్రభుత్వం.

యూపీలో ఐదుగురు...

ఉత్తర్​ప్రదేశ్​లోని బలియా జిల్లాలో పిడుగుపాటు ఘటనలు సంభవించి గురువారం ఐదుగురు మరణించారు. మరో 12మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చూడండి: మొసలిని చంపి.. మాంసాన్ని పంచిపెట్టి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.