జమ్ముకశ్మీర్‌లో క్రమక్రమంగా ఆంక్షల్ని ఎత్తివేస్తుంది కేంద్ర ప్రభుత్వం. శుక్రవారం రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుకున్నాయి. సమాచార వ్యవస్థ ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది. తాజాగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది కేంద్రం. ఐదు జిల్లాల్లో(జమ్ము, రియాసీ, సాంబా, కథువా, ఉధమ్‌పూర్) 2జీ అంతర్జాల సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఆగస్టు 5న రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సమాచార వ్యవస్థను వినియోగించి ఉగ్రవాద సంస్థలు ఉగ్రకార్యకలాపాలకు పాల్పడే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో క్రమక్రమంగా సేవలను పునరుద్ధరించడానికి నిర్ణయించారు.
17 ఎక్స్చేంజీల్లో ...
17 ఎక్స్చేంజీల్లో ల్యాండ్‌లైన్ సర్వీసులను శనివారం పునరుద్ధరించారు. కంటోన్మెంట్, శ్రీనగర్ విమానాశ్రయం, సివిల్ లైన్స్ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి.
రాష్ట్రంలో 100కు పైగా ల్యాండ్‌లైన్ ఎక్స్చేంజీలు ఉన్నాయి. వీటిని క్రమక్రమంగా పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సెంట్రల్ కశ్మీర్‌లోని బడ్గాం, సోనమార్గ్, మనిగామ్.. ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, తంగ్‌మార్గ్ ప్రాంతాల్లో ల్యాండ్‌లైన్ సేవలను స్థానికులు వినియోగించుకుంటున్నారు.
దక్షిణ కశ్మీర్‌లోని కాజీగుండ్, పహల్గామ్ ప్రాంతాల్లోనూ సేవలను పునరుద్ధరించారు.
ఇవీ చూడండి:-