ETV Bharat / bharat

కశ్మీర్​లో విదేశీ ప్రతినిధుల బృందం పర్యటన

author img

By

Published : Feb 12, 2020, 2:02 PM IST

Updated : Mar 1, 2020, 2:13 AM IST

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను సమీక్షించేందుకు 25 మందితో కూడిన విదేశీ బృందం కశ్మీర్​కు చేరుకుంది. శ్రీనగర్​లో స్థానికులతో సమావేశమై వారి అభిప్రాయాలకు తెలుసుకున్నారు.

25-foreign-envoys-reach-kashmir-to-witness-ground-situation
కశ్మీర్​లో విదేశీ ప్రతినిధుల బృందం..

ఆర్టికల్ 370 రద్దు అనంతరం నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు 25మంది ఐరోపా సమాఖ్య, ఇతర దేశాల ప్రతినిధులు కశ్మీర్​లో పర్యటిస్తున్నారు. తొలుత శ్రీనగర్​కు చెరుకున్న ప్రతినిధులు దాల్​ సరస్సును సందర్శించారు. అనంతరం స్థానికులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

కశ్మీర్​లో పర్యటిస్తున్న విదేశీ బృందంలో జర్మనీ, కెనడా, ఫ్రాన్స్​, న్యూజిలాండ్​, మెక్సికో, ఇటలీ, అఫ్గానిస్థాన్​, ఆస్ట్రియా, ఉజ్బెకిస్థాన్​, పోలాండ్​తోపాటు ఐరోపా సమాఖ్యకు చెందిన రాయబారులు ఉన్నారు.

ఇంతకుముందు..

ఇంతకుముందే ఐరోపా సమాఖ్యకు చెందిన 23 మంది ఎంపీలు కశ్మీర్​ను సందర్శించారు. అయితే నాటి పర్యటనపై ఇంటర్నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ నాన్​-అలైన్డ్​ స్టడీస్ విమర్శలు చేసింది. కేవలం ఒక వర్గం వారినే ప్రభుత్వం ఈ పర్యటనకు ఆహ్వానించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతినిధుల పర్యటనకు ప్రభుత్వం దూరంగా ఉంది. ఐరోపా సమాఖ్య పార్లమెంట్ సభ్యుల పర్యటన వారి వ్యక్తిగతమైనదని వెల్లడించింది.

పౌరసత్వ చట్ట సవరణ, కశ్మీర్​ అంశంపై గత నెలలో ఈయూ పార్లమెంట్​లో జరిగిన చర్చపై ఓటింగ్​ నిర్వహించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

Intro:Body:

https://www.aninews.in/news/national/politics/batch-of-25-envoys-reaches-kashmir-to-witness-ground-situation20200212112059/

Conclusion:
Last Updated : Mar 1, 2020, 2:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.