గుజరాత్లోని వల్సాద్ నగరంలో 13 గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో కలిసి చిత్రలేఖనం పోటీలు నిర్వహించింది ద టార్గెట్ చారిటబుల్ ట్రస్ట్. ఇందులో గిరిజన వారసత్వ ఉనికిని చాటేందుకు 'వార్లి' పెయింటింగ్ చేపట్టింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి రామనాభాయ్ పట్కర్ హాజరయ్యారు.
గిరిజన ఆచారాలను, వారి జీవితాలతో ముడిపడిన అనేక విషయాలను బహిర్గతం చేసే ప్రత్యేక కళ 'వార్లి'ని కాపాడాలని చారిటీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2109 గిరిజన విద్యార్థులు ఒకే సమయంలో వార్లి చిత్రలేఖనంలో పాల్గొన్నారు. ఇంతమంది విద్యార్థులు ఒకే చోట చేరి పేయింటింగ్ వేయటం భారత్లోనే తొలిసారి. ఈ కార్యక్రమం ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు.
ఎన్నో ఏళ్లనాటి గిరిజన సంప్రదాయాలతో వార్లి పెయింటింగ్ ముడిపడి ఉంది. వీటిని ఇళ్ల గోడలు, వస్త్రాలపై చిత్రీకరిస్తారు. ప్రస్తుత కాలంలో ఈ కళకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో వార్లి పేయింటింగ్పై అవగాహన కల్పించే దిశగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: దిల్లీ దంగల్: త్రిముఖ పోరులో నిలిచి గెలిచేదెవరో?