వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి 21 విపక్ష పార్టీలు. 50శాతం వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
గత తీర్పు...
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం ఈవీఎంల్లో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చాలని కోరాయి.
విపక్షాల అభ్యర్థనపై ఈసీ అభ్యంతరం తెలిపింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యపడదని తేల్చిచెప్పింది. అందుకు మౌలిక వసతులు, మానవ వనరులు సమస్య ఎదురవుతుందని పేర్కొంది.
ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు... ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒకటికి బదులు 5 వీవీప్యాట్ ఈవీఎంల రసీదులు లెక్కించాలని తీర్పునిచ్చింది.
ఈ తీర్పుతో సంతృప్తి చెందని విపక్షాలు... సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
ఇదీ చూడండి: సీజేఐ కేసులో 'కుట్ర'పై కీలక విచారణ