ETV Bharat / bharat

సీఎం భద్రతా సిబ్బందిలో ఇద్దరికి కరోనా - UP Covid

కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ భద్రతా సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. దాంతో ముఖ్యమంత్రి నివాసాన్ని శానిటైజ్​ చేశారు. ఇప్పటికే యోగి ప్రభుత్వంలో ఐదుగురు మంత్రులు, వారి కుటుంబ సభ్యుల్లో కొందరికి కరోనా సోకింది.

CM Yogi tested positive
ముఖ్యమంత్రి భద్రత సిబ్బందిలో ఇద్దరికి కరోనా!
author img

By

Published : Jul 17, 2020, 12:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ఈ వైరస్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నివాసాన్ని తాకింది. సీఎం భద్రతా సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్​గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కరోనా బారిన పడ్డ ఇద్దరు సిబ్బంది పీఏసీ(ప్రొవిన్షియల్​ ఆర్డ్మ్​ కానిస్టేబులరీ)కి చెందిన వారు. ముఖ్యమంత్రి నివాసం బయట మోహరించిన బలగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

భద్రతా సిబ్బందికి కరోనా సోకిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నివాసాన్ని పూర్తిగా శానిటైజ్​ చేశారు.

ఐదుగురు మంత్రులకు..

యూపీలో ఇప్పటికే యోగి మంత్రివర్గంలోని ఐదుగురు మంత్రులు సహా వారి కుటుంబ సభ్యుల్లోని పలువురికి కరోనా పాజిటివ్​గా తేలింది. అందులో ఉప ముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య కుటుంబ సభ్యులూ ఉన్నారు.

308 కొత్త కేసులు..

ఉత్తర్​ప్రదేశ్​ రాజధాని లఖ్​నవూలోనే గురువారం ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు కొత్తగా 308 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 45 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 41,000లకు చేరింది. వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ కాలంలో 6.5 లక్షల ఉద్యోగాల కోత​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.