ETV Bharat / bharat

శరద్ పవార్ భద్రతా​ సిబ్బందికి కరోనా

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​కు చెందిన ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా సోకింది. దీంతో పవార్​, ఆయన కుటుంబసభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు... బంగాల్​లో వైరస్​ సోకి తృణమూల్​ కాంగ్రెస్​కు చెందిన ఓ ఎమ్మెల్యే మృతి చెందారు.

author img

By

Published : Aug 17, 2020, 1:26 PM IST

2 security guard of sharad pawar found corona positive
పవార్ భద్రతా​ సిబ్బందికి కరోనా

ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​కి చెందిన ఇద్దరు భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. దీంతో పవార్​తో పాటు ఆయన​ కుటుంబ సభ్యులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

పవార్​కు మొత్తం ఆరుగురు సిబ్బంది భద్రతను కల్పిస్తున్నారు. వీరంతా ముంబయిలోని నివాసం వద్ద విధులు నిర్వరిస్తున్నారు. వీరికి ఆదివారం వైరస్​ పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి సోకినట్లు తేలింది. ఈ సిబ్బంది ఎన్​సీపీ అధినేతతో సన్నిహతంగా లేరని సమాచారం.

టీఎంసీ ఎమ్మెల్యే మృతి..

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సమరేశ్​ దాస్​ కరోనాతో మృతి చెందారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్​ నాయకుడు తెలిపారు.

కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావటం వల్ల ఆసుపత్రిలో చేరారు దాస్​. అప్పటికే గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

ఎగ్రా నియోజక వర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు దాస్​. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

ఇదీ చూడండి 'విషమంగానే ప్రణబ్​ ఆరోగ్య పరిస్థితి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.