ETV Bharat / bharat

భారతీయులపై నేపాల్​ పోలీసుల కాల్పులు అందుకే! - భారత్​ నేపాల్ సరిహద్దులో కాల్పులు

బిహార్​ సరిహద్దులో భారత పౌరులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. మరొక వ్యక్తిని నేపాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు, నేపాల్​ పోలీసుల మధ్య వాగ్వాదమే కాల్పులకు దారితీసినట్లు తెలుస్తోంది.

Nepal police
భారత పౌరులపై నేపాల్​ కాల్పులు
author img

By

Published : Jun 12, 2020, 5:37 PM IST

భారత్​- నేపాల్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత పౌరులపై నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. లగాన్ యాదవ్​ అనే వ్యక్తిని నేపాల్​ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన స్థానికులకు, నేపాల్ సాయుధ పోలీసు బలగాల(ఏపీఎఫ్) మధ్య జరిగిందని సశస్త్ర సీమా బల్​ పట్నా సరిహద్దు ఐజీ సంజయ్​ కుమార్​ తెలిపారు. వికాస్ యాదవ్ అనే వ్యక్తికి ఛాతీ భాగంలో బుల్లెట్​ తగలటం వల్ల చనిపోయినట్లు వెల్లడించారు.

18 రౌండ్ల కాల్పులు..

భారతీయ పౌరులపై 18 రౌండ్ల కాల్పులు జరిపాయి నేపాలీ బలగాలు. కాల్పుల మోతతో సమీపంలో పనులు చేస్తున్న కూలీలు పరుగులు తీశారు. భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో మరింత మంది గాయపడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

సీతామడి జిల్లాలోని జానకీ నగర్​, నేపాల్​ సర్లాహి మధ్య సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఎస్​ఎస్​బీ ఆ ప్రాంతంలో బలగాలను మోహరించింది. నేపాల్​ కూడా బలగాలను తరలించింది.

స్థానిక ఘర్షణ..

నేపాల్​ భూభాగంలో ఉదయం 8.40 గంటలకు ఈ కాల్పులు జరిగినట్లు సశస్త్ర సీమా బల్​ డీజీ కుమార్​ రాజేశ్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, ఘటన జరిగిన వెంటనే నేపాల్ అధికారులతో స్థానిక కమాండర్లు సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు.

"నేపాల్​లోని సర్లాహి ఎస్పీతో బిహార్​ సితామడి ఎస్పీ మాట్లాడారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇది పూర్తిగా స్థానిక సమస్య. వాగ్వాదం వల్ల జరిగిన కాల్పులు ఇవి. ఇది దీర్ఘకాలం కొనసాగదు. ప్రాథమిక విచారణ ఆధారంగా సేకరించిన నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించాం."

- కుమార్ రాజేశ్ చంద్ర, ఎస్ఎస్​బీ డీజీ

నేపాల్​ చెబుతున్నదేంటి?

కాల్పుల ఘటనపై స్పందించిన నేపాల్​ ఏపీఎఫ్​ ఐజీపీ నారాయణ బాబు థాప.. 25 నుంచి 30 మంది నేపాల్​లో చొరబడేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. సర్లాహీ జిల్లాలోని భారత్​- నేపాల్ సరిహద్దులో వీరికి అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడ్డారని తెలిపారు.

వీరికి మరింత మంది జత కలిసి భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరారని వెల్లడించారు థాప. ఆత్మరక్షణలో భాగంగా మొదటి హెచ్చరికగా గాల్లోకి కాల్పులు జరిపామని, అప్పటికీ వాళ్లు వెనక్కి తగ్గకపోవటం వల్ల కాల్పులు జరిపినట్లు స్పష్టం చేశారు.

నేపాల్​ భూభాగంలో సరిహద్దు నుంచి 75 మీటర్ల లోపల ఈ ఘటన జరిగిందని తెలిపారు నారాయణ బాబు.

స్థానికులు ఇలా..

సరిహద్దు ప్రాంతాల్లో ఇరువైపుల బంధువులు ఉన్నారు. కంచె లేని కారణంగా సులభంగా ఇరు ప్రాంతాల వాళ్లు కలుసుకుంటారు. లగాన్​ యాదవ్​ కోడలు నేపాల్​లో ఉంటుంది. కొంతమంది భారత పౌరులతో మాట్లాడటం చూసిన ఏపీఎఫ్ సిబ్బంది.. ఆమె అక్కడ ఉండేందుకు నిరాకరించారు.

ఇది వాగ్వాదానికి దారి తీసింది. సుమారు 80 మంది భారతీయులు అక్కడికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు ఏపీఎఫ్​ సిబ్బంది. అనంతరం లక్ష్యంగా చేసుకుని కాల్చినట్లు తెలుస్తోంది.

భారత్​- నేపాల్ వివాదం..

కొద్ది రోజులుగా భారత్‌, నేపాల్‌ మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. సరిహద్దుల్లో ఉన్న లిపులేక్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు తమవే అంటూ నేపాల్ వాదిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవల మ్యాపును కూడా విడుదల చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.