ETV Bharat / bharat

Bhangra Dance On Skates : స్కేట్స్​తో భాంగ్రా డ్యాన్స్​.. అమ్మాయి ప్రతిభ అదుర్స్.. దేశంలో ఏకైక వ్యక్తిగా..

Bhangra Dance On Skates : స్కేట్స్​తో పంజాబ్​ సంప్రదాయ నృత్యమైన భాంగ్రాను ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తోంది చండీగఢ్​కు చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి. తన ప్రతిభతో పలు రికార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న ఆమె.. ప్రపంచ రికార్డు సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. దేశంలో ఇలా వినూత్నంగా భాంగ్రా డ్యాన్స్​ చేస్తున్న ఏకైక వ్యక్తిగా నిలిచిన ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం.

Bhangra Dance On Skates Video
Bhangra Dance On Skates Video
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2023, 6:31 AM IST

స్కేట్స్​తో భాంగ్రా డ్యాన్స్​.. అమ్మాయి ప్రతిభ అదుర్స్.. దేశంలో ఏకైక వ్యక్తిగా..

Bhangra Dance On Skates : కొందరు ప్రతి విషయంలో కొత్తదనం కోరుకుంటారు. అందులో భాగంగా తాము చేసే పనిని రోటీన్​కు భిన్నంగా చేస్తుంటారు. ఆ కోవకే చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి.. రికార్డులు కొల్లగొడుతోంది. పంజాబీ సంప్రదాయ నృత్యమైన భాంగ్రాను.. స్కేట్స్​ వేసుకుని మరీ వినూత్నంగా చేసి అబ్బురపరుస్తోంది. ఆటలో సంప్రదాయాన్ని మిళితం చేసి 'స్కేటింగ్ భాంగ్రా' ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. అలా 'భాంగ్రా గర్ల్​ ఆన్​ స్కేట్స్​'గా గుర్తింపు పొందింది చండీగఢ్​కు చెందిన జాన్వీ.

"నాకు చాలా అవార్డులు వచ్చాయి. నేను రాష్ట్ర స్థాయి అవార్డు, మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు, జాతీయ స్థాయి అవార్డు సాధించాను. ఇప్పటివరకు ఫ్రీ స్టైల్​ స్కేటింగ్​లో ప్రపంచ స్థాయిలో ఎవరూ పతకం సాధించలేదు. నేను దాన్ని సాధించాలి. నేను సంప్రదాయ భాంగ్రా డ్యాన్స్​తో స్కేటింగ్​ను మిళితం చేసి సరికొత్తగా ప్రదర్శించాను. నాలాగే డ్యాన్స్​, రీల్స్​, వీడియోలు చేసే యువత కూడా వాటితో సంస్కృతిని మిళితం చేసి వినూత్నంగా ముందుకు రావాలి. అది మిగతా వారికి స్ఫూర్తినిస్తుంది"
--జాన్వీ, స్కేటింగ్​ భాంగ్రా డ్యాన్సర్

భాంగ్రా నృత్యానికి ఆకర్షితురాలైన జాన్వీ.. 9 ఏళ్ల వయసు నుంచే సాధన చేయడం మొదలు పెట్టింది. కుమార్తె ప్రతిభను గుర్తించిన ఆమె తండ్రి.. స్కేట్​లపై భాంగ్రా ప్రదర్శించమని ప్రోత్సహించాడు. జాన్వీకి కూడా అది కొత్తగా అనిపించడం వల్ల స్కేట్స్​తో భాంగ్రా చేయడం ప్రారంభించింది. అలా యూట్యూబ్​ సహాయంతో కొత్త డ్యాన్స్​ మూవ్​లను నేర్చుకుంది. 2019 నుంచి ప్రదర్శనలను మొదలు పెట్టిన జాన్వీ.. పలు రికార్డులు సైతం సొంతం చేసుకుంది. కాగా భయపడకుండా స్కేటింగ్ చేసేలా జాన్వీకి శిక్షణ ఇచ్చామని ఆమె తండ్రి తెలిపారు.

Bhangra Dance On Skates
స్కేట్స్​తో భాంగ్రా డ్యాన్స్​ చేస్తున్న జాన్వీ

"ఇక్కడ ప్రధాన నైపుణ్యం స్కేట్‌లు. జాన్వీ సాహసోపేతమైన అమ్మాయి. అందుకే ఆమెకు స్కేటింగ్​ చేయాలన్న ఆలోచన వచ్చింది. స్కేటింగ్​ చేస్తున్నప్పుడు పడిపోతామేమో అని ఆమె ఎప్పుడూ భయపడలేదు. పడిపోతామేమో అనే భయం లేకుండా ఆమెకు మేము శిక్షణ ఇచ్చాము. అది స్కేట్​లపై మృదువుగా భాంగ్రా లేదా ఇతర ఏదైనా డ్యాన్స్​ చేయడానికి సహాయపడుతుంది"
--జాన్వీ తండ్రి

దేశంలో స్కేట్​లపై భాంగ్రా నృత్యం చేసే ఏకైక బాలికగా గుర్తింపు పొందిన జాన్వీ.. ఇండియా బుక్ ఆఫ్​ రికార్డ్స్​లో స్థానం సంపాదించింది. ఇలా సరికొత్త నైపుణ్యంతో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ స్కేటింగ్​ భాంగ్రా డ్యాన్సర్.. గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించడమే తన లక్ష్యమని చెబుతోంది.

స్కేటింగ్​లో 'సృష్టి' అదుర్స్​.. 11ఏళ్లలో 6 గిన్నిస్‌ రికార్డులు.. మరో రెండు వెయిటింగ్​!

కళ్లకు గంతలతో 'మిరాకిల్ కిడ్' సూపర్ సైకిల్​ రైడ్​.. కరెన్సీ నోట్లను ఈజీగా గుర్తుపడుతూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.