Bhagwant mann news: పంజాబ్‌లో తిరుగులేని విజయం సాధించిన ఆమ్ఆద్మీ పార్టీ.. తనదైన శైలిలో పాలన అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికలు పూర్తైన దృష్ట్యా పంజాబ్‌లోని 122 మంది నాయకుల భద్రతను తగ్గిస్తున్నట్లు పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తెలిపారు. దీనివల్ల 403 మంది పోలీసు సిబ్బంది, 27 పోలీస్ వాహనాలు పోలీస్ స్టేషన్లకు వెళ్లిపోయాయని అన్నారు.
![Bhagwant mann news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14720784_temple.jpg)
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండొద్దని.. భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫొటోలు మాత్రమే ఉండాలని ఆదేశించారు మాన్. పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీకి ఘనవిజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు అమృత్‌సర్‌లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
![Bhagwant mann news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14720784_jakli.jpg)
![Bhagwant mann news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14720784_jalian.jpg)
Arvind kejriwal news: చాలా ఏళ్ల తర్వాత పంజాబ్‌కు నిజాయితీ కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
"నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత పంజాబ్‌కు నిజాయితీ ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. మాన్ చాలా నిజాయితీపరుడు. ప్రభుత్వానికి వచ్చే రూపాయి ప్రజలకోసమే ఖర్చు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం."
-- ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్
ఆప్‌కు చెందిన రాజకీయ నేతగానీ, ఎమ్మెల్యే గానీ ఏదైనా పొరపాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కేజ్రీవాల్. పంజాబ్‌లోని దిగ్గజ నేతలైన ప్రకాశ్ సింగ్ బాదల్, సుఖ్బీర్ సింగ్ బాదల్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్‌జీత్ సింగ్ చన్నీ, బిక్రమ్ సింగ్ మజితియాను ప్రజలు ఓడించి ఇంటికి పంపారని అన్నారు. కేవలం మాన్ ఒక్కరే కాదని.. పంజాబ్‌లోని ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రేనన్నారు కేజ్రీవాల్.
![Bhagwant mann news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14720784_aams.jpg)
Punjab Election Result: ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 117 సీట్లకు గాను 92 సీట్లు కైవసం చేసుకుంది ఆప్. పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ సింగ్ మాన్ ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇదివరకే ప్రకటించినట్టు.. స్వాతంత్ర్యసమర యోధుడు భగత్‌సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్కలన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి: ఉత్తరాఖండ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా రీతూ?
సంక్షేమానికే యూపీ ప్రజల ఓటు.. పనిచేసిన మోదీ 'మేజిక్'!
సీఎంపై గెలిచి ఎమ్మెల్యే అయిన కుమారుడు.. తల్లి మాత్రం బడిలో స్వీపర్‌గానే..