ETV Bharat / bharat

కరోనా​ను ఎదుర్కోవటంలో మాస్కులే శ్రీరామ రక్ష - కరోనా వైరస్ కట్టడిపై నిపుణుల అభిప్రాయం

కరోనా వైరస్‌ ధాటిని ఎదుర్కోవాలంటే ఎన్‌-95 వంటి ప్రత్యేక రకం (హైఫై) మాస్కుల్ని వాడడం అన్నివిధాలా ఉత్తమమనీ, కనీసం వస్త్రంతో తయారైనవాటిని వాడినా ఎంతోకొంత రక్షణ కచ్చితంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. కరోనా కల్లోలం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి.. తదితర అంశాలపై వేర్వేరు రంగాలకు చెందిన ముగ్గురు నిపుణులతో 'ఈటీవీ భారత్‌' చర్చా కార్యక్రమం నిర్వహించింది.

mask
మాస్కు
author img

By

Published : May 13, 2021, 12:23 PM IST

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్‌ ధాటిని ఎదుర్కోవాలంటే ఎన్‌-95 వంటి ప్రత్యేక రకం (హైఫై) మాస్కుల్ని వాడడం అన్నివిధాలా ఉత్తమమనీ, కనీసం వస్త్రంతో తయారైనవాటిని వాడినా ఎంతోకొంత రక్షణ కచ్చితంగా లభిస్తుందని నిపుణులు అంటున్నారు. వైరస్‌ ఎంతమందికి సోకిందో సత్వరం తేల్చడంలో ర్యాపిడ్‌ పరీక్షల్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనా కల్లోలం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి.. తదితర అంశాలపై వేర్వేరు రంగాలకు చెందిన ముగ్గురు నిపుణులతో 'ఈటీవీ భారత్‌' చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఎబోలా కట్టడిలో కీలక పాత్ర పోషించిన డాక్టర్‌ రణు ధిల్లన్, 'పేషెంట్‌ నో హౌ డాట్‌కామ్‌' వ్యవస్థాపకుడు దేవభక్తుని శ్రీకృష్ణ, మధ్యప్రదేశ్‌లోని గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యరంగ సేవలు అందిస్తున్న అదృశ్‌భద్ర దీనిలో అనేక విషయాలనూ వివరించారు.

వైద్య పరిజ్ఞానం, సౌకర్యాల లేమి వంటి సమస్యలతో పాటు విధాన నిర్ణయాలూ కరోనాను ఎదుర్కోవటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి మీరిచ్చే సలహా?

డా. రణు ధిల్లన్‌: ఆరోగ్య వ్యవస్థపై ఎప్పుడూ లేని ఒత్తిడి పడుతోంది. వైరస్‌ వ్యాప్తి ఇంకా ఉద్ధృతమయ్యే అవకాశముంది. దీనిని తగ్గించటంపైనే ప్రస్తుతానికి దృష్టి సారించాలి. బాధితుల చికిత్సకు అవసరమైన వనరుల ఏర్పాటు అవసరం. మాస్క్‌లు ధరించటం, ర్యాపిడ్‌ టెస్ట్‌లు పెంచటంతో పాటు కొవిడ్‌ బారిన పడిన వారికి ఇంట్లోనే చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలి.

కరోనా పరీక్షలు చేసినప్పుడు కొన్ని ఫలితాలు సరిగా రావటం లేదు. ఓ సారి పాజిటివ్‌... మరోసారి నెగటివ్‌ అని వస్తున్నాయి. కచ్చితమైన ఫలితాలు వచ్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి..?

డా. రణు ధిల్లన్‌: కొన్నిసార్లు ఆర్‌టీ-పీసీఆర్‌ విధానంలోనూ కచ్చితమైన ఫలితాలు రావటం లేదు. వైరస్‌ రూపాంతరం చెంది విస్తరిస్తున్న తరుణంలో ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టుల సంఖ్యను కావాల్సినంతగా పెంచడం సాధ్యం కాదు. కొందరిలో లక్షణాలు కనిపించటం లేదు. వీరిద్వారా ఇతరులకు వైరస్‌ సోకుతోంది. ఆర్‌టీ-పీసీఆర్‌పైనే ఆధారపడకుండా ర్యాపిడ్‌ టెస్టులను పెంచాలి. లక్షణాలు లేకున్నా శరీరంలో వైరస్‌ ఉనికి ఉన్నవారిని గుర్తించటానికి ర్యాపిడ్‌ టెస్టులు ఉపకరిస్తాయి. వీటిని వేగవంతం చేయాలి.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వైరస్‌ విస్తరిస్తోంది. ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కోవటంలో ఒకే విధానం అనుసరించేందుకు ఇదే సవాలుగా ఉందని భావిస్తున్నారా..?

డా. రణు ధిల్లన్‌: స్థానిక వ్యాప్తి ఆధారంగా చర్యలు చేపట్టాలి. వైరస్‌ నియంత్రణ విధానాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. జన సమూహాల్లో మాస్క్‌ ధరించటం లాంటి జాగ్రత్తలు ఎక్కడైనా పాటించాల్సిందే. ర్యాపిడ్‌ పరీక్షలు పెంచాలి. అనుమానంగా అనిపిస్తే ఎవరికివారు వెంటనే పరీక్ష చేయించుకుని వ్యాప్తిని నిలువరించాలి. పాజిటివ్‌ అని తేలితే ఏకాంతంలోకి వెళ్లడంతో పాటు లక్షణాలు ఉంటే దానికి తగ్గ చికిత్స తీసుకోవటం చాలా కీలకం.

భారత్‌లో నెలకొన్న ఆరోగ్య అత్యయిక స్థితి అధిగమించడానికి ఎలాంటి చర్యలు అవసరం అని భావిస్తున్నారు..?

డా. రణు ధిల్లన్‌: హైఫై మాస్క్‌ల వాడుక ద్వారా వైరస్‌ వ్యాప్తి చాలావరకు తగ్గుతుంది. దాదాపు వ్యాక్సిన్‌ తీసుకున్నంత రక్షణ పొందొచ్చు. రెండో మార్గం.. ఆంక్షలు. వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించుకోవాలి. లక్షణాలున్న వారు సొంతంగా పరీక్షలు చేయించుకునేలా చూడాలి.

మొత్తంగా.. భారత్‌లో ఎలాంటి పరిస్థితి ఉందని భావిస్తున్నారు..?

డా. రణు ధిల్లన్‌: ఇది కచ్చితంగా ఆరోగ్య అత్యయిక స్థితి. వైరస్‌ వ్యాప్తిని నిలువరించటానికి ఏం చేయాలో మనకు అవగాహన ఉంది. కేంద్రంతో పాటు రాష్ట్రస్థాయిలోనూ నియంత్రణపై దృష్టి సారించాలి. స్థానిక యంత్రాంగాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సాధించగలం.

గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలకు తలెత్తుతున్న సమస్యలేంటి..? అక్కడి కరోనా బాధితులను గుర్తించటంలో ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి..?

అదృశ్‌ భద్ర: సామాజిక ఆరోగ్య కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉంటాయి. ఎవరిలోనైనా స్వల్ప లక్షణాలు కనిపిస్తే... చాలారోజుల పాటు పరీక్ష చేయించుకోకుండా అలాగే ఉంటున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్తూ వైరస్‌ వ్యాప్తికి కారణం అవుతున్నారు. ఇంటింటికీ వెళ్లి ర్యాపిడ్‌ టెస్టులు చేయటం ఎంతో అవసరం. సరైన సమయంలో బాధితులను గుర్తించేందుకు ర్యాపిడ్‌ టెస్టులు ఎక్కువ మొత్తంలో చేయాలి. అవగాహన కల్పించాలి.

హైఫై మాస్క్‌ల ఉపయోగాలేమిటి? కరోనాపై పోరాటంలో అవి ఏ మేర ఉపకరిస్తాయి..?

దేవభక్తుని శ్రీకృష్ణ: కెఎఫ్‌ 94, ఎన్‌ 95, ఐరోపాలోని ఎఫ్‌ఎఫ్‌పి-2, చైనాలోని కెఎన్‌-95 మాస్క్‌లను హైఫై మాస్క్‌లుగానే పరిగణిస్తాం. సాధారణంగా మనం శ్వాస తీసుకునేటప్పుడు గాలిలో ఉన్నవన్నీ లోపలికి వెళతాయి. గాలి ద్వారా ప్రయాణించే కరోనా బహిరంగ ప్రదేశాల్లో కన్నా మూసి ఉన్న గదుల్లో ఎక్కువగా పోగు పడుతుంది. అక్కడ కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన రోగి ఉంటే.. గదిలో పొగ తాగితే ఎలా దట్టంగా అలముకుంటుందో అతడి శ్వాస పరిస్థితీ అలానే అవుతుంది. హైఫై మాస్కుల ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. హైఫై అంటే.. హై ఫిల్టరేషన్, హై ఫిట్‌.

ఈ విషయం మరింత వివరంగా చెప్పగలరా? ఏ మాస్క్‌ వినియోగంతో ఎక్కువ రక్షణ అన్న సందేహాలు వీడటం లేదు. ప్రస్తుతానికి చాలా మంది ఎన్‌ 95 మాస్క్‌లనే ప్రామాణికంగా భావిస్తున్నారు.

దేవభక్తుని శ్రీకృష్ణ: ఎన్‌ 95 మాస్క్‌లు అమెరికా సీడీసీ, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్‌ సంయుక్త ప్రమాణాల మేరకు తయారవుతాయి. వస్త్రంతో తయారైన మాస్క్‌ పెట్టుకుంటే.. శ్వాస తీసుకున్నప్పుడు సూక్ష్మ రేణువులు లోపలికి వెళ్లిపోతాయి. ఆ మాస్క్‌లు ఈ రేణువులను 20 శాతమే నిలువరించలగలవు. 95% మేర వీటి నుంచి రక్షణ పొందేలా ఎన్‌ 95 మాస్క్‌ను తయారు చేశారు. వాటినైనా వదులుగా ధరిస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు.

రెండు మాస్కులు ధరించటం సురక్షితమేనా..? చాలామంది దీనివల్ల శ్వాస తీసుకోలేకపోతున్నామని అంటున్నారు?

దేవభక్తుని శ్రీకృష్ణ: వైరస్‌ను అడ్డుకోవడంలో రెండు మాస్కులు ఒక ప్రత్యామ్నాయం. ఎన్‌ 95 లాంటి మాస్క్‌లు అందుబాటులో లేనప్పుడే ఇవి ధరించాలి. డబుల్‌ మాస్క్‌లు వేసుకుంటే 75% మాత్రమే వైరస్‌ నుంచి రక్షణ ఉంటుందని గుర్తించాం. అదే ఎన్‌ 95 మాస్క్‌తో 5% మాత్రమే గాలిలోని సూక్ష్మకణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్తాయి. ఇవి అందుబాటులో లేనప్పుడు సర్జికల్‌ మాస్క్‌ ధరించాలి. దానిమీద క్లాత్‌ మాస్క్‌ పెట్టుకోవాలి.

ఇదీ చదవండి: కరోనాను జయించిన వారి ఊపిరితిత్తులు, మెదడులో గడ్డలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.