కర్ణాటక బెంగళూరుకు చెందిన ఓ నకిలీ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్..సవితా శర్మ అనే యువతి అకౌంట్ నుంచి రూ. 50వేలు కాజేసింది. ఆన్లైన్లో రాజస్థానీ భోజనం ఆర్డర్ చేసిన సవితా శర్మకు రూ.10 ఆఫర్ అంటూ మరో లింక్ వచ్చింది. యువతి ఆశతో లింక్‌పై క్లిక్ చేయగా ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.50వేలు దోచుకున్నారు సైబర్ నేరగాళ్లు. తరువాత ఫుడ్ యాప్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది.
" సైబర్ నేరాలు చాలా రకాలు. నకిలీ ప్రభుత్వ వెబ్సైట్లను సృష్టించటం దగ్గర నుంచి ఆన్లైన్లో వేధించటం, ఆర్థిక లావాదేవీలు, సమాచారాన్ని తస్కరించటం వంటివి జరుగుతాయి. సైబర్ నేరగాళ్లు ఎక్కడైనా కూర్చొని..ప్రజల బ్యాంకు ఖాతాలను నగదు కాజేస్తారు. ప్రజలు తమ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను ఎవ్వరికీ చెప్పవద్దు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో మోసపోయామని భావిస్తే..వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలి. "
--అభినవ్ సౌరభ్, సైబర్ నిపుణులు
అయితే ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న రాజస్థాన్ గ్యాంగ్‌ను కర్ణాటక పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. నకిలీ ఆధార్ కార్డ్స్ సృష్టించి వాటితో డూప్లికేట్ సిమ్ కార్డులను పొందాలని చూశారు.
ఇదీ చదవండి : చిలుక కోసం పాముతో ఐదేళ్ల బుడతడి పోరాటం