ETV Bharat / bharat

ఈజ్​ ఆఫ్​ లివింగ్​ సూచీలో బెంగళూరు టాప్​

కేంద్రం ప్రకటించిన ఈజ్​ ఆఫ్​ లివింగ్​ సూచీలో బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. 10 లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల ర్యాంకింగ్స్​లో సిమ్లా అగ్రస్థానం పొందింది. మంచి పనితీరు కనబర్చిన పురపాలికల జాబితాలో ఇందోర్​ నెంబర్​వన్​లో ఉంది.

author img

By

Published : Mar 4, 2021, 1:50 PM IST

Updated : Mar 4, 2021, 3:46 PM IST

Bengaluru ranked top on government's Ease of Living Index
ఈజ్​ ఆఫ్​ లివింగ్​ సూచీలో బెంగళూరు టాప్​

జీవన సౌలభ్య సూచీలో (ఈజ్​ ఆఫ్​ లివింగ్)​ సూచీలో బెంగళూరు అగ్రస్థానం దక్కించుకుంది. దేశంలోని 111 నగరాల్లో.. పుణె, అహ్మదాబాద్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. చెన్నై, సూరత్​, నవీ ముంబయి, కోయంబత్తూర్​, వడోదరా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

దేశంలోని వేర్వేరు నగరాల్లో జీవనం సాగించేందుకు ఉన్న పరిస్థితులు ఆధారంగా కేంద్రం ఈ​ ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పురీ ఈ జాబితాను విడుదల చేశారు.

పది లక్షల కన్నా తక్కువ జనాభా ఉన్న నగరాల ఈజ్​ ఆఫ్​ లివింగ్ సూచీలో సిమ్లా తొలి స్థానంలో నిలిచింది.

దిల్లీ, ఇందోర్​..

10 లక్షల కంటే తక్కువ జనాభాతో మంచి పనితీరు కనబర్చిన పురపాలికల జాబితాలో న్యూ దిల్లీ మొదటిస్థానం దక్కించుకుంది. 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పురపాలికల్లో.. ఇందోర్​ తొలిస్థానం పొందింది.

ఇదీ చూడండి: లైఫ్‌స్టైల్‌ మార్చేస్తాయ్‌.. ఓ లైక్‌ వేసుకోండి!

Last Updated : Mar 4, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.