ETV Bharat / bharat

15 నెలలుగా మార్చురీలో కరోనా మృతదేహాలు- ఆస్పత్రి డీన్​పై వేటు

బెంగళూరులోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో కుళ్లిన మృతదేహాలను గుర్తించిన ఘటనకు సంబంధించి ఆ ఆస్పత్రి డైరెక్టర్​ ప్రొఫెసర్​, డీన్​ డాక్టర్ జితేంద్ర కుమార్​ను తొలగించింది కార్మిక శాఖ. ఆయన స్థానంలో డాక్టర్​ రేణుకా రామయ్యను నియమించింది.

COVID-19 dead bodies in ESI hospital
బెంగళూరు ఈఎస్​ఐసీ ఆస్పత్రి
author img

By

Published : Dec 2, 2021, 6:51 PM IST

Bengaluru ESIC hospital: కర్ణాటక బెంగళూరులోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో కొవిడ్​తో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను కుళ్లిపోయిన స్థితిలో గుర్తించిన ఘటనపై కార్మిక మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆ ఆసుపత్రి డీన్​ డాక్టర్​ జితేంద్ర కుమార్​ను తొలగించింది. ఆయన స్థానంలో డాక్టర్ రేణుకా రామయ్యను నియమించింది.

COVID-19 dead bodies in ESI hospital
కొత్త డీన్​ డాక్టర్​ రేణుకా రామయ్య, పాత డీన్​ జితేంద్ర కుమార్​

అమానవీయం..

Covid dead bodies in ESI Hospital: కరోనా బాధితులైన 40 ఏళ్ల మహిళ, ఓ 50 ఏళ్ల పురుషుడు.. బెంగళూరు రాజాజీనగర్​లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్(ఈఎస్​ఐసీ) ఆస్పత్రిలో గతేడాది జూన్​లో చేరారు. అదే ఏడాది జులైలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ వారు మరణించారు. అప్పటి నుంచి వారి మృతదేహాలు ఆదే ఆస్పత్రిలో ఉండిపోయాయి. ఆ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వర్తించకుండా అలాగే వదిలేశారు.

COVID-19 dead bodies in ESI hospital
ఆస్పత్రిలో మృతదేహాలను ఉంచిన స్థలం

నవంబరు 26న హౌస్​కీపింగ్ సిబ్బంది ఆస్పత్రిలోని కోల్డ్​ స్టోరేజీ​ క్లీనింగ్ కోసం వెళ్లగా.. అసలు విషయం బయటపడింది.

ఈ ఘటనపై రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు జరపాలని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక కార్మిక శాఖ మంత్రి ఏ శివరామ్ హెబ్బార్​కు భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎస్​ సురేష్​ కుమార్ లేఖ రాశారు.

ఇదీ చూడండి: 235 కేజీల భారీకాయుడికి ఆపరేషన్​.. కొద్దిగంటల్లోనే అనూహ్య మార్పు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.