ETV Bharat / bharat

'పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవిబాట పట్టిస్తున్న నక్సల్స్​' - ఛత్తీస్​గఢ్​ న్యూస్​

school Children joining Naxalite organization: నక్సలైట్లు పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవి బాట పట్టిస్తున్నారని బస్తర్​ ఐజీ తెలిపారు. ఇప్పటికే చాలా మంది పిల్లలు నక్సలైట్ల సంస్థల్లో చేరారని పేర్కొన్నారు. వారందరినీ తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

school Children joining Naxalite organization
'పాఠశాల విద్యార్థులను ప్రలోభ పెట్టి అడవిబాట పట్టిస్తున్న నక్సల్స్​'
author img

By

Published : Jan 11, 2022, 11:28 AM IST

school Children joining Naxalite organization: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి కారణంగా పాఠశాల విద్యార్థులు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. భారత్​లో కొవిడ్ మూడో దశ నేపథ్యంలో స్కూళ్లకు పలు రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఖాళీగా ఉంటున్నారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ఛత్తీస్​గఢ్​లోని నక్సలైట్ సంస్థలు స్కూల్​ పిల్లలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయని బస్తర్​ ఐజీ సుందర్రాజ్​ పీ వెల్లడించారు. పాఠశాల దశలోనే విద్యార్థులను మావోయిస్టులుగా మార్చి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

కరోనా కట్టడి కోసం బస్తర్​లోని పాఠశాల ఆశ్రమాలను గత రెండేళ్లుగా మూసివేశారు. దీన్ని అదునుగా తీసుకున్న నక్సలైట్లు విద్యార్థులను ప్రలోభ పెట్టి తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై మాకు కచ్చితమైన సమాచారం ఉంది. అయితే ఎంత మంది పిల్లలు ఇప్పటికే నక్సల్స్ సంస్థల్లో చేరి ఉంటారని అంచనా వేయలేకపోతున్నాం. పాఠశాల ఆశ్రమాలకు తిరిగి వచ్చిన విద్యార్థులను తమ స్నేహితుల గురించిన వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ తర్వాత అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. నక్సలైట్లు అభివృద్ధికి, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. కరోనా సమయంలో వారి అసలు రూపం ఏంటో అందరికీ తెలిసింది. నక్సల్స్​ సంస్థల్లో చేరిన విద్యార్థులను తిరిగి తీసుకువచ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేస్తాం.

-బస్తర్ ఐజీ సుందర్రాజ్​

ఇదీ చదవండి: దేశ రాజకీయాల్లో 'టెక్​ ఫాగ్'​ కలకలం- భాజపాపై విపక్షాల నిప్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.