ETV Bharat / bharat

Bank Jobs 2023 : బ్యాంక్​ క్లర్క్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​.. దరఖాస్తు చేసుకోండిలా! - Nainital Bank Notification Important Dates

Bank Jobs 2023 In Telugu : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. నైనిటాల్​ బ్యాంక్​ 110 క్లర్క్​, మేనేజ్​మెంట్​ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. విద్యార్హత, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం..

Nainital Bank Recruitment 2023
Bank Jobs 2023
author img

By

Published : Aug 12, 2023, 12:03 PM IST

Bank Jobs 2023 : బ్యాంకింగ్​ రంగంలో పనిచేయాలని అభిలషించే అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. నైనిటాల్ బ్యాంకు 110 క్లర్క్​, మేనేజ్​మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో (Nainital Bank Recruitment 2023) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
Nainital Bank Job Vacancy :

  • క్లర్క్​ - 50 పోస్టులు
  • మేనేజ్​మెంట్​ ట్రైనీ​ (MT) - 60 పోస్టులు

విద్యార్హతలు
Bank Job Eligibility : అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్​ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్​ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్​లో అనుభవం ఉండాలి.

వయోపరిమితి
Bank Job Age Limit : అభ్యర్థుల వయస్సు 2023 జూన్​ 30 నాటికి 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

పేస్కేల్​
Nainital Bank Clerk Pay scale :

  • నైనిటాల్​ బ్యాంకులోని మేనేజ్​మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.40,000 చొప్పున అందిస్తారు.
  • క్లర్క్​ ఉద్యోగాలకు సెలక్ట్​ అయిన వారికి రూ.19,900 నుంచి రూ.47,920 వరకు పేస్కేల్​ ఉంటుంది.

ఎంపిక విధానం
Nainital Bank Selection Process : అభ్యర్థులకు ఆన్​లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయినవారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ
Nainital Bank Application Process : అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ముందుగా https://www.nainitalbank.co.in/ వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి. అందులో క్లర్క్​ అండ్​ ఎంటీ అప్లికేషన్​ లింక్​పై క్లిక్​ చేయాలి. తరువాత దరఖాస్తులో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. తరువాత అప్లికేషన్ ఫీజు ఆన్​లైన్​లోనే చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత మీ సర్టిఫికేట్స్ అప్​లోడ్ చేసి, దరఖాస్తును మరోసారి పూర్తిగా సరిచూసుకొని.. సబ్​మిట్​ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్​అవుట్​ను తీసుకొని భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
Nainital Bank Notification Important Dates :

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 ఆగస్టు 05
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 27
  • ఆన్​లైన్​ పేమెంట్​కు ఆఖరు తేదీ : 2023 ఆగస్టు 27
  • పరీక్ష తేదీలు : 2023 సెప్టెంబర్​ 9న జరిగే అవకాశం ఉంది.

నోట్​ : ఒక వేళ పరీక్ష తేదీలో ఏమైనా మార్పులు చేస్తే.. ఈ-మెయిల్​ ద్వారా అభ్యర్థులకు ముందుగానే సమాచారం అందిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.