గాజులు విక్రయిస్తున్న(bangle sellers) ఓ వ్యక్తిపై మూక దాడికి(mob attack) పాల్పడ్డారు దుండగులు. తీవ్రంగా చితకబాది.. అతని వద్ద ఉన్న బ్యాగులోని గాజులు, ఇతర వస్తువులు, ఫోన్ను ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్, బాణగగా నగరంలోని గోవింద్ నగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదీ జరిగింది..
ఉత్తర్ప్రదేశ్ హర్దోయీకి చెందిన యువకుడు.. ఉపాధి నిమిత్తం ఇందోర్ వెళ్లాడు. రక్షా బంధన్ సందర్భంగా వీధి వీధి తిరుగుతూ గాజులు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో గోవింద్ నగర్లో కొందరు మహిళలకు గాజులు చూపిస్తుండగా ఆకస్మతుగా అక్కడికి వచ్చిన పలువురు.. దాడికి పాల్పడ్డారు. కాళ్లతో తన్నుతూ తీవ్రంగా కొట్టారు. మా వీధికే వస్తావా అంటూ దుర్భాషలాడారు.
మైనారిటీ కమ్యూనిటికీ చెందిన వాడనే దాడి చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగారు కొందరు స్థానికులు. వారికి సర్దిచెప్పిన సెంట్రల్ కొత్వాలీ పోలీసులు సెక్షన్ 14 ప్రకారం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: బిర్యానీ రుచిగా లేదన్నారని... బాదేశారు