తమిళనాడులో ఉన్న నిత్యానంద ఆశ్రమం నుంచి తన కుమార్తెను రక్షించాలని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఆశ్రమంలో తన కుమార్తె ఉందని, అడిగితే నిర్వాహకులు అమ్మాయి లేదని చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?...: శ్రీ నగేష్, మాల భార్యాభర్తలు. శ్రీనగేష్ రిటైర్డ్ ఇంజినీర్ కాగా, మాల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరికి వైష్ణవి, వరూధిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరు కర్ణాటక.. బెెంగళూరులోని ఆర్ఆర్ నగర్‌కు చెందినవారు. కొన్నాళ్ల క్రితం శ్రీ నగేష్, అతని కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులోని నిత్యానంద ఆశ్రమంలో చేరి.. కొన్ని రోజులపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం అతని భార్య మాల, పెద్ద కుమార్తె వైష్ణవి ఆశ్రమం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. అయితే చిన్న కుమార్తె వరూధిని మాత్రం ఆశ్రమంలోనే ఉండిపోయింది.
కొన్నాళ్ల తర్వాత శ్రీ నగేష్ నిత్యానంద ఆశ్రమానికి వెళ్లి తన కూతురు వరూధినిని పంపాలని ఆశ్రమ నిర్వాహకులను కోరారు. కానీ వరూధినిని ఆశ్రమం నుంచి వేరే చోటుకు తరలించామని తెలిపారు. శ్రీ నగేష్ పలు ఆశ్రమాలలో వెతికారు. కొన్నాళ్లకు తమిళనాడులోని తిరువణ్నామలైలోని నిత్యానంద ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడ తన కుమార్తె వరూధినిని గుర్తించారు. ఆశ్రమ నిర్వహకులను తన కూతురిని తనతో పంపమని అడడగా వారు వరూధిని అక్కడ లేదని చెప్పారు. కూతుర్ని అక్కడి నుంచి ఎలా రక్షించుకోవాలో శ్రీ నగేష్‌కు అర్థం కాలేదు. దీంతో నిత్యానంద ఆశ్రమంలో చిక్కుకున్న తన కుమార్తెను రక్షించాలని కోరుతూ శ్రీ నగేష్ ఆదివారం తిరువణ్నామలై రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: క్షుద్రపూజలతో మహిళ హత్య.. పేగులు తీసి.. ముక్కలుగా నరికి దహనం