Ballot Papers Stolen : కర్ణాటకలోని రామనగర జిల్లాలో ఎన్నికల అధికారుల కారును అడ్డగించిన కొందరు వ్యక్తులు.. బ్యాలెట్ పేపర్లు, రెండు ల్యాప్‌టాప్‌లు దొంగలించి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మాగడి తాలూకా హోసపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. హుల్లేనహళ్లి పాల ఉత్పత్తిదారుల సంఘం డైరెక్టర్ పదవికి ఎన్నిక జరగాల్సి ఉంది. అందుకు సంబంధించిన విధుల కోసం ఎన్నికల అధికారి ఉమేశ్, ఉషతో సహా ఐదుగురు హుల్లేనహళ్లి గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో కెంచనహళ్లి సమీపంలో అధికారుల బొలెరో వాహనాన్ని నలుగురు వ్యక్తులు అడ్డగించారు.
గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడే..
ఎన్నికల అధికారుల వద్ద ఉన్న 250 బ్యాలెట్ పేపర్లు, 2 ల్యాప్‌టాప్‌లు దోచుకుని పరారయ్యారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎన్నికల అధికారిని కారు ఢీకొట్టగా.. ఇంతలో నిందితులు పారిపోయారు. అయితే గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు బలరాం, అతడి సహచరులు ఈ దోపిడీకి పాల్పడ్డారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
-
Karnataka | The Returning officer and his team who were in Magadi taluk of Ramanagara district to conduct elections of Hullenahalli milk producers’ cooperative society were robbed and attacked by four unknown people on 27th September. 250 ballot papers and two laptops were robbed… pic.twitter.com/oevmjVPiLw
— ANI (@ANI) September 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Karnataka | The Returning officer and his team who were in Magadi taluk of Ramanagara district to conduct elections of Hullenahalli milk producers’ cooperative society were robbed and attacked by four unknown people on 27th September. 250 ballot papers and two laptops were robbed… pic.twitter.com/oevmjVPiLw
— ANI (@ANI) September 28, 2023Karnataka | The Returning officer and his team who were in Magadi taluk of Ramanagara district to conduct elections of Hullenahalli milk producers’ cooperative society were robbed and attacked by four unknown people on 27th September. 250 ballot papers and two laptops were robbed… pic.twitter.com/oevmjVPiLw
— ANI (@ANI) September 28, 2023
ఎన్నికలను అడ్డుకునేందుకే..
ఘటనకు సంబంధించి దాసేగౌడ, శ్రీనివాస్, హేమంత్ సహా మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు మాగడి పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఎన్నికలను అడ్డుకునేందుకే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోందని అన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత మరిన్ని వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం.. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్‌లో జగత్‌పుర్ యాక్సిక్ బ్యాంక్‌లోని రూ. 7 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు దొంగలు. బ్యాంక్ సిబ్బందిని గదిలో వేసి బంధించి.. లాకర్లోని సొమ్ముతో పరారయ్యారు. అడ్డుకోబోయిన బ్యాంక్ మేనేజర్‌ను గాయపరిచారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఉద్యోగులు బ్యాంక్‌ను తెరిచి.. కార్యకలపాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఏడుగురు గుర్తు తెలియని దుండగులు అకస్మాత్తుగా బ్యాంక్‌లోకి ప్రవేశించారు. కత్తితో బెదిరించి బ్యాంక్ మేనేజర్‌ను లాకర్ తాళం ఇవ్వాలని అడిగారు. దీనికి మేనేజర్ అంగీకరించకపోవడం వల్ల అతడి తొడపై గాయం చేశారు. అనంతరం లాకర్ తాళం తీసుకుని.. సెక్యూరిటీ గార్డు సహా బ్యాంక్ ఉద్యోగులను ఓ గదిలో వేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.