ETV Bharat / bharat

వాషింగ్‌ మెషిన్‌లో పడ్డ చిన్నారి.. 15 నిమిషాలు సర్ఫ్​ నీళ్లలోనే.. 7 రోజులు కోమాలో ఉండి.. - వాషింగ్ మెషీన్​లో పడిపోయి ప్రాణాలతో బయటపడిన బాబు

వాషింగ్‌ మెషిన్‌లో పడ్డ ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏడు రోజులు కోమాలోకి వెళ్లిన ఆ బాలుడు.. తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. దిల్లీలో జరిగిందీ ఘటన.

Baby got stuck in a washing machine for 15 minutes survived

author img

By

Published : Feb 19, 2023, 8:53 AM IST

Updated : Feb 19, 2023, 8:59 AM IST

వాషింగ్‌ మెషిన్‌లో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారి.. మృత్యువుతో పోరాడి గెలిచాడు. కోమాలోకి వెళ్లిన ఆ చిన్నారి తిరిగి కోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని దిల్లీలో జరిగింది.
అసలేం జరిగిందంటే?
వసంత్​ కుంజ్​కు చెందిన ఓ మహిళ.. తన ఇంట్లోని ఓ గదిలో ఉన్న టాప్‌ లోడింగ్‌ వాషింగ్‌ మెషిన్‌లో బట్టలు వేసి ఆన్‌ చేసి వెళ్లింది. ఆమెకు ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. ఒక్కసారిగా గదిలో బాబు కనిపించలేదు. 15 నిమిషాల తర్వాత వాషింగ్‌ మెషిన్‌లో కనిపించాడు. ఆ తర్వాత వెంటనే వాషింగ్‌ మెషిన్‌లో నుంచి బాబు తీసి వసంత్‌కుంజ్‌లోని ఓ ఫోర్టిస్ ఆసుపత్రికి కుటుంబసభ్యుల సహాయంతో ఆమె తరలించింది.

హాస్పిటల్ ఐసీయూ వార్డులో ఆ చిన్నారి దాదాపు ఏడురోజులు కోమాలో వెంటిలేటర్​పై ఉన్నాడు. అనంతరం 12 రోజులు వార్డులో ఉండి చికిత్స పొందాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యాడు. అయితే కుర్చీ సహాయంతో వాషింగ్‌ మెషిన్‌పైకి తమ కుమారుడు ఎక్కి ఉండవచ్చని చిన్నారి తల్లి తెలిపింది.

అయితే ఆ ప్రమాదం నుంచి చిన్నారి కోలుకోవడం అద్భుతమని వైద్యులు అన్నారు. హాస్పిటల్​కు తీసుకుని వచ్చేటప్పుడు చిన్నారి.. అపస్మారక స్థితిలో ఉన్నాడని చెప్పారు. న్యుమోనియాతో పాటు జీర్ణకోశ ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు వెల్లడించారు. సబ్బు నీరు కారణంగా వివిధ అవయవాల పనితీరు చావా వరకు దెబ్బతిందని తెలిపారు. చిన్నారి కోలుకునేందుకు అవసరమైన యాంటీబయాటిక్స్​, ఐవీ ఫ్లూయిడ్ సపోర్టు అందించినట్లు అన్నారు. క్రమంగా చిన్నారి కోలుకుని తన తల్లిని గుర్తుపట్టడం ప్రారంభించిన తర్వాత వెంటిలేటర్ తొలగించినట్లు డాక్టర్ హిమాన్షి జోషి వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 19, 2023, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.