ETV Bharat / bharat

మహిళా ఖైదీకి పండంటి ఆడబిడ్డ- జైలులో సంబరాలు - హల్ద్​వానీ జైలు

జైలులో ఉన్న మహిళకు పురిటినొప్పులొచ్చాయి. ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ జైలు సంబరాలు జరుపుకుంది. తల్లీబిడ్డలు తిరిగి జైలుకు వెళ్లగా.. వారికి వేదమంత్రాలతో స్వాగతం లభించింది. సంప్రదాయబద్ధంగా ఆ బిడ్డ నామకరణ వేడుకలు జరిగాయి. ఈ ఘటన ఉత్తరాఖండ్​ నైనితాల్​లోని హాల్ద్​వానీ జైలులో జరిగింది.

Haldwani jail news
జైలులో వేడుకలు
author img

By

Published : Nov 2, 2021, 7:28 PM IST

పోక్సో చట్టం కింద ఈ ఏడాది జనవరిలో ఓ మహిళ.. ఉత్తరాఖండ్​ నైనితాల్​ జిల్లాలో ఉన్న హల్ద్​వానీ జైలుకు వెళ్లింది. ఆమె అప్పటికే గర్భవతి. తాజాగా.. గత నెల 31న ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. రిషికేష్​లోని ఎయిమ్స్​కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. అనంతరం ఆమెను ఎయిమ్స్​లో చేర్చారు. అక్కడే ఆమెకు పండంటి ఆడ బిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు.

ఎయిమ్స్​ నుంచి డిశ్చార్జ్​ అయిన అనంతరం బిడ్డతో పాటు మహిళను జైలుకు తీసుకెళ్లారు. వారికి అక్కడ వేదమంత్రాలతో స్వాగతం లభించింది. ఇందుకోసం స్థానిక పండితుడిని అధికారులు పిలిపించారు. సోమవారం ఆడబిడ్డకు నామకరణం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వేడుక జరిగింది. ఈ పూర్తి వ్యవహారంపై జైలులోని ఇతర మహిళా ఖైదులు హర్షం వ్యక్తం చేశారు. జానపద గేయాలు ఆలపిస్తూ రోజును గడిపారు.

తల్లీబిడ్డలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు జైలు సిబ్బంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి పోషకాలున్న ఆహారాన్ని అందిస్తున్నారు.

హల్ద్​వానీ జైలులో ఖైదీకి శిశువు జన్మించడం ఇదేమీ కొత్త కాదు. 2010లో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇదీ చూడండి:- భార్యకు నిప్పంటించిన భర్త- కడుపులోని శిశువు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.