ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఓ పిల్ల ఏనుగు బావిలో పడింది. దీని గమనించిన గ్రామస్థులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఐదు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి దానిని రక్షించారు. ఈ సమయంలోనే మరో ఏనుగుల గుంపు అక్కడ ఉన్న గ్రామస్థులు, అటవీ శాఖ అధికారులపై దాడి చేసింది.

ఏనుగుల దాడిలో సుమారు నాలుగు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఘటనా స్థలంలో నిలిపి ఉంచిన అధికారుల వాహనాలను కూడా ఏనుగుల గుంపు ధ్వంసం చేసినట్లు అటవీ సిబ్బంది తెలిపారు.


గత కొద్ది రోజులుగా.. సుమారు 15 ఏనుగులు ఆహారం కోసం అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోని చాకుందపాద గ్రామంలోని వచ్చిన పిల్ల ఏనుగు బావిలో పడినట్లు తెలిపారు. గజరాజులు ఏ క్షణాన దాడి చేస్తాయే అనేది తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నట్లు గ్రామస్థులు వాపోయారు.
ఇదీ చూడండి: యువతకు స్ఫూర్తిగా 80ఏళ్ల బామ్మ- రోజూ 20 కి.మీ. సైకిల్ తొక్కి ఉద్యోగానికి...