ETV Bharat / bharat

13 నెలల బిడ్డ తల నరికి.. తల్లి ఆత్మహత్య - బిడ్డ తల నరికి తల్లి ఆత్మహత్య

ఉత్తర్​ప్రదేశ్​లోని బులందర్​షహర్​లో ఓ తల్లి.. తన 13నెలల బిడ్డ తల నరికేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది.

Baby beheaded, mother found dead in UP
13 నెలల బిడ్డ తల నరికి.. తల్లి ఆత్మహత్య
author img

By

Published : Feb 26, 2021, 1:13 PM IST

మతిస్థిమితం లేని ఓ తల్లి.. తన 13 నెలల పసికందు తలను నరికేసింది. ఆ తర్వాత ఆమె కుడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ బులందర్​షహర్​ జిల్లాలో జరిగింది.

కొడవలితో!

23 ఏళ్ల జితేంద్రి మానసికంగా అనారోగ్యానికి గురైంది. ఆమె భర్త రాజస్థాన్​లో టైలర్​గా పనిచేస్తున్నాడు. గురువారం.. విజయ్​ నగ్లియా ప్రాంతంలోని తన నివాసంలో.. కొడుకు తలను నరికేసింది జితేంద్రి.

శబ్దాలు విన్న జితేంద్రి వదిన.. ఇంటిలోకి పరుగులు తీసింది. తల్లి, బిడ్డ కనపడకపోవడం వల్ల ఇంటి పైకి వెళ్లింది. అక్కడే.. తల లేని పసికందు శవం కనపడింది.

ఇంటి వెనుక ఉన్న ఓ గదిలో జితేంద్రి శవాన్ని ఆమె వదిన గుర్తించింది. ఆ గది తలుపు లోపలి నుంచి వేసి ఉండటం వల్ల.. దానిని బద్దలు కొట్టింది. తలుపు తెరిచేసరికి జితేంద్రి ఆపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించింది. పక్కనే ఓ కొడవలి, విష పదార్థాలు కూడిన ప్యాకెట్​, పాల సీసా కనిపించాయి. ఈ వివరాలను ఆమె వదిన పోలీసులకు వెల్లడించింది.

జితేంద్రిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి:- 'హరియాణాలోనూ 'లవ్​జిహాద్​' చట్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.