కొవిడ్ మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉందన్న అంచనాల నేపథ్యంలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) పిల్లల కోసం ఓ కిట్‌ను(immunity booster medicine) రూపొందించింది. 16 ఏళ్ల లోపు వయసున్నవారికి ఉద్దేశించి.. రోగనిరోధక శక్తిని పెంచే 'బాల్ రక్షా కిట్'ను(immunity booster for kids) అభివృద్ధి చేసింది. కేంద్ర ఆయుష్ శాఖ పరిధిలో ఏఐఐఏ పనిచేస్తోంది. ఈ కిట్ కొవిడ్ కారక కరోనా వైరస్‌పై(immunity booster for covid) పోరాడేందుకు, పిల్లలను ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుందని ఆయుష్ శాఖ అధికారులు తెలిపారు. ఇంతవరకు పిల్లలకు కొవిడ్ టీకా రాని నేపథ్యంలో వారి ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించి ఈ కిట్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
కిట్‌లో భాగంగా.. తులసి, తిప్పతీగ, దాల్చిన చెక్క, లికొరైస్ (యష్టిమధుకం), ఎండు ద్రాక్షలతో తయారు చేసిన సిరప్‌తోపాటు అన్ను ఆయిల్, సీతోపలాది, చ్యవన్‌ప్రాశ్‌లు ఉంటాయని వెల్లడించారు. ఈ సిరప్‌లో అద్భుత ఔషధ గుణాలున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కిట్‌ను రూపొందించారని.. దీన్ని ప్రభుత్వ రంగ సంస్థ 'ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యుటికల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఐఎంపీసీఎల్) తయారు చేసినట్లు చెప్పారు. నవంబరు 2న జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఏఐఐఏ 10 వేల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనుంది.
ఇదీ చూడండి: డ్యాన్స్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి.. మోదీ కితాబు