పడవలో మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న పాకిస్థాన్ ముఠాను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) పట్టుకుంది. 8 మంది నుంచి 30 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. దీని ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.150 కోట్లుగా ఉంటుందని అంచనా.
అరేబియా సమద్రంలోని అంతర్జాతీయ సముద్ర సరిహద్దు ప్రాంతమైన కచ్‌లోని జఖౌ తీరం వద్ద ఈ ముఠాను గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్టు గార్డు దళం సంయుక్తంగా పట్టుకున్నాయి.
ఇదీ చూడండి:దాల్ సరస్సులో 'పడవ ర్యాలీ'కి విశేష స్పందన
ఇదీ చూడండి:ముంచుకొస్తున్న మాదక మహోత్పాతం!