ETV Bharat / bharat

అసోం సీఎం హత్యకు కుట్ర.. ఆ వీడియోతో గుట్టు రట్టు! - హిమంత బిశ్వశర్మ

అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హత్యకు కుట్ర జరిగినట్టు తెలుస్తోంది(assam cm news). అదే రాష్ట్రానికి చెందిన శరత్​ దాస్​ అనే ఓ వ్యక్తిని.. కొందరు దుండగులు అపహరించి, సీఎంను హత్య చేయాలని చేతికి తుపాకీ ఇచ్చారు(himanta latest news). ఈ విషయాన్ని శరత్​ స్వయంగా వెల్లడించాడు. తనని రక్షించమంటూ ఓ వీడియోలో వేడుకున్నాడు.

himanta latest news
అసోం సీఎం
author img

By

Published : Oct 10, 2021, 3:01 PM IST

అసోంలో ఓ వీడియో కలకలం సృష్టించింది. రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మను(assam cm news) హత్య చేయాలంటూ కొందరు ఒత్తిడి చేస్తున్నారని, తనను రక్షించాలంటూ శరత్​ దాస్​ అనే వ్యక్తి వీడియో తీసి పోస్ట్​ చేశాడు(himanta latest news). వీడియో వైరల్​ కాగా.. పోలీసులు శరత్​ను రక్షించారు.

అసోంలోని లఖింపుర్​ జిల్లాకు చెందిన శరత్​.. శనివారం వీడియో విడుదల చేశాడు. అందులో తన పరిస్థితిని వివరించాడు.

himanta latest news
శరత్​ దాస్​

"అసోం ప్రజలారా.. జాగ్రత్తగా ఉండండి. దిమాపుర్​(నాగాలాండ్​) నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని పనుల మీద నేను ఇక్కడి 9వ తేదీన వచ్చాను. కొందరు నన్ను అపహరించారు. నా చేతికి పిస్టల్, మూడు బులెట్లు ఇచ్చారు. 'మామ'ను చంపాలని ఒత్తిడి చేశారు. ఈ విషయం బయటకు తెలిస్తే వీళ్లు నన్ను చంపేస్తారు. నా డాక్యుమెంట్లు, నా దగ్గర ఉన్న రూ.3లక్షలు తీసుకున్నారు. నన్ను హింసిస్తున్నారు."

--- శరత్​ దాస్​, అసోంవాసి.

సీఎం హిమంత బిశ్వశర్మను ఆయన మద్దతుదారులు ముద్దుగా 'మామ' అని పిలుస్తారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయనకు ఆ పేరు వచ్చింది.

అసోం-నాగాలాండ్​ సరిహద్దు ప్రాంతమైన ఖంఖతిలోని ఓ హోటల్​లో శరత్​ను కనుగొని, అతడిని రక్షించినట్టు పోలీసులు ప్రకటించారు. శరత్​ చెప్పింది నిజమా? కాదా? అన్న విషయంపై దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:- ఇంకెన్నాళ్లీ రాష్ట్రాల సరిహద్దు వివాదాలు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.