Assam Collector: దేశ రాజధాని దిల్లీలో ఐఏఎస్ అధికారుల జంట సంజీవ్ ఖిర్వార్, ఆయన భార్య రింకూ దుగ్గా అధికార దుర్వినియోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అసోంలో ఓ ఐఏఎస్ అధికారిణి అంకితభావం అందరితోనూ ప్రశంసలు అందుకుంటోంది. కాలి నడకన బురదలో నడుచుకుంటూ వెళ్లి వరద ప్రభావిత ప్రాంత వాసుల కష్టాలను వింటున్న ఆమె వృత్తినిబద్ధతపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దిల్లీ ఐఏఎస్ అధికారుల జంటతో ఆమెను పోల్చుతూ కొనియాడుతున్నారు.
![Assam Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15409148_6.jpg)
కీర్తి జల్లి. మన తెలుగు యువతే. అసోంలోని కఛార్ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. అసోంను వరదలు ముంచెత్తుతున్న సమయంలో స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. చీరకట్టులోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితుల గోడు విన్నారు.
![Assam Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15409148_1.jpg)
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సాదకబాధకాలను ఓపిగ్గా విన్న కీర్తి జల్లి వారికి కావాల్సిన నిత్యావసరాలను సైతం పంపిణీ చేశారు. వరదల నుంచి ఆయా ప్రాంతాలను రక్షించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె అంకితభావం, వృత్తి నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు.
![Assam Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15409148_4.jpg)
2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కీర్తి జల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఐఏఎస్ పూర్తైన తర్వతా అసోంలో వివిధ బాధ్యతల్లో పనిచేసిన కీర్తి.. మహిళలు, శిశు మరణాలను తగ్గించడానికి, వారి ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కొవిడ్ సమయంలో తన వివాహంతో కూడా వార్తల్లో నిలిచారు కీర్తి జల్లి. పెళ్లైన తర్వాత రోజే విధుల్లోకి వెళ్లి తన వృత్తినిబద్ధతను చాటుకున్నారు.
![Assam Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15409148_3.jpg)
![Assam Collector](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15409148_2.jpg)
ఇదీ చదవండి: ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని నేను చేయలేదు: మోదీ