ETV Bharat / bharat

భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు

అసోంలోని ఓ వైద్యురాలికి ఒకేసారి రెండు వేరియంట్లు సోకినట్లు అధికారులు తెలిపారు. వైద్యురాలి శరీరంలో ఆల్ఫా, డెల్టా వేరియంట్లను గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ఆమె కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నారని స్పష్టం చేశారు.

DOUBLE INFECTION
భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు
author img

By

Published : Jul 20, 2021, 12:26 PM IST

కరోనా వైరస్‌లో కొత్త రకాలు పుట్టుకొస్తున్న వేళ.. ఒకే వ్యక్తికి రెండు వేరియంట్లు సోకిన ఘటన భారత్‌లో వెలుగుచూసింది. అసోంలోని ఓ వైద్యురాలు ఒకేసారి ఆల్ఫా, డెల్టా వేరియంట్ల బారినపడినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయింది. వైద్య నిపుణుల అంచనా ప్రకారం ఇది తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు.

"ఆమె నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా.. ఆల్ఫా, డెల్టా వేరియంట్లు సోకినట్లు గుర్తించాం. ఈ డబుల్‌ ఇన్ఫెక్షన్‌పై స్పష్టత కోసం మరోసారి నమూనాలను సేకరించి, పరీక్షించాం. ఆమె ఒకే సమయంలో రెండు వేరియంట్ల బారినపడినట్లు నిర్ధరించుకున్నాం. మొదట ఆమె భర్త ఆల్ఫా వేరియంట్ బారినపడ్డారు."

-విశ్వజ్యోతి బొర్కాకొటి, ఐసీఎంఆర్ అధికారి

అయితే ఆ వైద్యురాలు టీకా రెండు డోసులు వేయించుకున్నారని విశ్వజ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఆమెకు లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇదివరకే ఆ దేశంలో..

ఇటీవల బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఈ డబుల్ ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు. ఆమెలో ఒకేసారి ఆల్ఫా, బీటా వేరియంట్లను గుర్తించారు. తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ వృద్ధురాలు అసలు టీకా వేయించుకోలేదని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలియజేశారు.

ఇదీ చదవండి: Covid in India: భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 30 వేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.