ETV Bharat / bharat

తేయాకు తోటల చుట్టూ అసోం రాజకీయాలు - అసోం ఎన్నికలు

తేయాకు తోటల చుట్టూ అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తేయాకు కూలీలపై ప్రధాన పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఎన్నికల వేళ ఇబ్బడిముబ్బడిగా హామీలిచ్చే నేతలు.. ఆ తర్వాత తిరిగి చూడటంలేదని వాపోతున్నారు కార్మికులు.

assam assembly elections parties go all out to woo tea garden workers
తేయాకు తోటల చుట్టూ అసోం రాజకీయాలు
author img

By

Published : Mar 26, 2021, 2:46 PM IST

అసోం రాజకీయాలు మరోసారి తేయాకు తోటల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు తేయాకు తోటల్లో ఓట్ల వేట సాగిస్తున్నాయి. తేయాకు తోటల్లో పనిచేసే లక్షలాది మంది కూలీలు 40 నియోజకవర్గాల్లో పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయనున్నారు. అసోం రాష్ట్ర జనాభాలో తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులు 17 శాతం వరకు ఉంటారు. అందుకే ఎన్నికల వేళ అన్ని పార్టీలు వారి చుట్టూ చక్కర్లు కొడుతూ హామీల వర్షం కురిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ తరఫున ఇటీవల అసోంలో ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తేయాకు తోటల్ని సందర్శించారు. అక్కడి కూలీలతో ముచ్చటించారు. వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కాసేపు వారితో కలిసి తేయాకు కూడా కోశారు.

assam assembly elections parties go all out to woo tea garden workers
తేయాకు తోటల్లో రాహుల్, ప్రియాంక

హామీలు గాలికి..

తేయాకు తోటల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తమ దినసరి కూలీ పెంచాలంటూ చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూలీ పెంపుపై హామీలు ఇచ్చే పార్టీలు.. అధికారం చేపట్టాక తమను పట్టించుకోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండా, వాన, చలిని లెక్కచేయకుండా పనిచేసినా కూడా కడుపునిండా భోజనం చేసే పరిస్థితి లేదని వాపోతున్నారు. అత్యంత వెనకబాటు జీవితాలను వెల్లదీస్తున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలతో బతుకుబండిని లాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు. పనిచేస్తూ కూడా పస్తులుండాల్సిన దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నట్లు కన్నీరు పెట్టుకుంటున్నారు.

మీరు.. కాదు మీరే..

తేయాకు తోటల్లో పనిచేసే కూలీల దయనీయ పరిస్థితులకు మీరంటే మీరంటూ ప్రధాన పార్టీలు ఒకదానిపై మరొకటి ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. 2016లో అనూహ్యంగా అధికారం చేపట్టిన భాజపా తేయాకు తోటల్లో పనిచేసే కూలీల కోసం రూ.3వేలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. ఈ మొత్తం తమకు ఏమాత్రం సరిపోదని కూలీలు పేర్కొంటున్నారు.

తేయాకు కార్మికురాలు

అసోంలో తిరిగి అధికారం చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్‌.. ఆ కూలీల దినసరి వేతనాన్ని రూ.167 నుంచి రూ.365లకు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమకు మళ్లీ అధికారం కట్టబెడతాయని కమలనాథులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నా.. ఈ ఎన్నికల్లో అస్సామీలు ఎవరికి జై కొడతారో చూడాలి.

ఇదీ చూడండి: బంగాల్​, అసోంలో తొలి దశ ప్రచారం సమాప్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.